Chandrababu Naidu Ring : ‘ఉంగరం’ నా విజయ రహస్యం
తన సక్సెస్ కు ఆ రింగు కారణమని కామెంట్
Chandrababu Naidu Ring : టీడీపీ చీఫ్ , మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మోస్ట్ డైనమిక్ లీడర్ గా పేరొందారు. 40 ఏళ్ల పాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిగా ఉన్నారు. ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన ఏపీకి తొలి సీఎం కూడా ఆయనే. ఇక ఎక్కువగా అభివృద్ది జపం చేసే చంద్రబాబు నాయుడు ఏది చేసినా లేదా ఏది మాట్లాడినా సంచలనమే.
ఆయన 24 గంటలు నిద్ర పోను నిద్ర పోనివ్వను అంటూ నినాదాన్ని బాగా నమ్ముతారు. ఎక్కువగా ఎవరినీ నమ్మరు. ఒక రకంగా చెప్పాలంటే తన నీడను కూడా తాను నమ్మరు. అంతలా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ఇష్టపడతారు. అంతే కాదు వయస్సు మీద పడుతున్నా ఎక్కడా అలా కనిపంచరు.
నేటి యువతతో పోటీ పడేందుకు సైతం రెడీగా ఉంటారు. క్రియేటివిటీకి ఎక్కువగా పెద్దపీట వేయాలని అనుకుంటారు. హైదరాబాద్ కు ఐటీ తీసుకు వచ్చింది తానేనని , లేక పోతే ఐటీ కంపెనీలు వచ్చి ఉండేవి కావని పదే పదే ప్రస్తావిస్తారు. జన్మభూమి పేరుతో అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూడా తానేనని చెప్పుకుంటారు.
ఇది పక్కన పెడితే ఎల్లప్పుడూ కొత్తదనం ఆస్వాదించేందుకు ఉత్సుకత చూపిస్తారు చంద్రబాబు నాయుడు. తాజాగా ఆయన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. అదేమిటంటే తాను ధరించే రింగు(Chandrababu Naidu Ring) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీని ధర రూ. 30,000 వేలు అని, అది ఇండియాలో దొరకదన్నారు.
ప్రస్తుతం అమెరికాలో మాత్రమే లభిస్తోందని అందుకే తాను ప్రమోట్ చేస్తున్నానని చెప్పారు. చిప్ ఆధారంగా రింగ్ పని చేస్తుందన్నారు. ఇది ఫోన్ కు కనెక్ట్ అయి ఉంటుందన్నారు బాబు.
Also Read : కవిత విచారణకు 11న మహూర్తం