Chandrababu Naidu : నన్ను చంపాలని చూశారు – చంద్రబాబు
వాళ్లే దాడి చేసి తనపై కేసు నమోదు ఎలా
Chandrababu Naidu : ప్రాజెక్టు సందర్శన కోసం తాను ముందస్తు సమాచారం ఇచ్చానని అన్నారు టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu). ఆయన మీడియాతో మాట్లాడారు. అంగళ్లు, పుంగనూర్ లో చోటు చేసుకున్న హింస, అల్లర్లకు తాను ఎలా బాధ్యుడిని అవుతానంటూ ప్రశ్నించారు. తాను శాంతియుతంగా ప్రాజెక్టుల సందర్శనకు బయలు దేరి వెళుతున్నానని ఇంతలోనే తనపై దాడి చేసేందుకు వైసీపీ గూండాలు ప్రయత్నం చేశారంటూ ఆరోపించారు. విచిత్రం ఏమిటంటే ఎన్ఎస్జీ ఎదుటే తనను చంపేందుకు యత్నించారంటూ సంచలన ఆరోపణలు చేశారు నారా చంద్రబాబు నాయుడు.
Chandrababu Naidu Asking
తాను ముందు నుంచీ రాష్ట్రంలో తిరుగుతున్నానని, ఇదే విషయం గురించి పోలీసులకు కూడా తమ పార్టీ శ్రేణులు ముందస్తు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. తన కార్యక్రమంలో అధికార పార్టీకి చెందిన వైసీపీ నేతలను ఎలా అనుమతించారో పోలీసులు జవాబు చెప్పాలన్నారు. హత్యా యత్నానికి పాల్పడిందే కాక తనపై రివర్స్ బుక్ చేశారంటూ ధ్వజమెత్తారు నారా చంద్రబాబు నాయుడు.
దీనికి ప్రధాన కారణం ఆంధ్రా పోలీస్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. ఈ మొత్తం ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడు ఎవరు ఏమిటి అనేది తేలుతుందన్నారు.
Also Read : Nara Lokesh : చిరంజీవి అన్న దాంట్లో తప్పేముంది