Chandrababu Naidu : వేధించారు నన్ను ఇరికించారు
నారా చంద్రబాబు నాయుడు ఫైర్
Chandrababu Naidu : విజయవాడ – ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కీం స్కామ్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. 10 గంటలకు పైగా విచారించింది. ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టింది. ఇరువురి తరపున వాదనలు వినిపిస్తున్నాయి.
Chandrababu Naidu Comments Viral
ఈ సందర్భంగా కోర్టు జడ్జి ముందు తాను వాదనలు వినిపించారు నారా చంద్రబాబు నాయుడు. తనకు మాట్లాడేందుకు ఛాన్స్ ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. ఈ మేరకు ఆయన కోరికను జడ్జి మన్నించారు. మీరు చెప్పుకునేందుకు వీలుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా తనకు ఏ పాపం తెలియదన్నారు. తనను వేధింపులకు గురి చేశారని, ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా తనను అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు చంద్రబాబు నాయుడు. తనను సూత్రధారి, పాత్రధారి అంటూ పేర్కొనడం సబబు కాదని పేర్కొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కక్ష సాధింపు ధోరణితో తనను ఇరికించేందుకు ప్రయత్నం చేశారని మండిపడ్డారు. కాగా స్కిల్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు కీలకమైన వ్యక్తిగా ఉన్నారని, తన సీఎం హోదాను అడ్డం పెట్టుకుని కోట్లు చేతులు మార్చేలా చేశాడంటూ ఏపీ సీఐడీ సంచలన ఆరోపణలు చేసింది.
Also Read : Chandrababu Naidu : 10 గంటలకు పైగా బాబు విచారణ