Chandrababu Naidu : చంద్రబాబు కామెంట్స్ కలకలం
జగన్ పుట్టుక తప్పుడు పుట్టుక
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ – ఏపీ మాజీ సీఎం , టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యన నోరు జారుతున్నారు. పదే పదే వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎంపై.
Chandrababu Naidu Comments Viral
ప్రత్యేకించి జగన్ రెడ్డి పుట్టుక గురించి ప్రస్తావించారు. జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ నీ పుట్టుకే తప్పుడు పుట్టుక అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి.
రోజు రోజుకు చంద్రబాబు దిగజారి పోతున్నారని, తాను ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలుసు కోలేని స్థితిలో ఉన్నాడని వైసీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఒక స్థాయి కలిగిన వ్యక్తి ఇలా దిగజారి పోయి మాట్లాడటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించాయి. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని పేర్కొన్నాయి.
చంద్రబాబు కావాలని రెచ్చగొట్టేలా కామెంట్స్ చేస్తున్నారని, రాష్ట్రంలో మనుషుల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. మొత్తంగా ఏపీలో పాలిటిక్స్ మరింత రసకందాయంగా మారాయి. నువ్వా నేనా అన్న రీతిలో పోటా పోటీగా మాటల తూటాలు పేల్చుతున్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్ లండన్ టూర్ లో ఉన్నారు.
Also Read : Minister KTR : పువ్వాడకు కేటీఆర్ ఖుష్ కబర్