Chandrababu Naidu : జ‌గ‌న్ మాఫియా కింగ్ – చంద్ర‌బాబు

నేను కియా తెచ్చా మీరు మాఫియా తీసుకొచ్చారు

Chandrababu Naidu : టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu) నిప్పులు చెరిగారు. ఏపీ స‌ర్కార్ ను, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. తాను ఎంతో ప్ర‌య‌త్నం చేసి కియా కార్ల కంపెనీని తీసుకు వ‌చ్చాన‌ని , దీని ద్వారా ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా 8 వేల మందికి ఉపాధి క‌లుగుతోంద‌న్నారు. తాను ఉపాధి చూపిస్తే జ‌గ‌న్ రెడ్డి మాఫియాను రాష్ట్రంలో తీసుకు వ‌చ్చాడ‌ని ఆరోపించారు.

Chandrababu Naidu Educate

తాను అభివృద్ది కోసం నిరంత‌రం త‌ప‌న ప‌డితే జ‌గ‌న్ త‌న అనుచ‌రులు, మంత్రులు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను మాఫియా డాన్ లుగా మార్చేశాడంటూ ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చేసిన ఘ‌న‌త జ‌గ‌న్ రెడ్డిద‌ని మండిప‌డ్డారు. వ్య‌వ‌స్థ‌ల‌ను అన్నింటిని నిర్వీర్యం చేశాడ‌ని ఏ ఒక్క‌రూ బ‌తికే ప‌రిస్థితి లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు చంద్ర‌బాబు. జ‌నం బుద్ది చెప్పేందుకు రెడీగా ఉన్నార‌ని ఆరోపించారు.

ఇప్ప‌టికే రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా చేసి ప్ర‌జ‌ల నెత్తిన టోపీ పెట్టేందుకు మ‌రోసారి సిద్ద‌మ‌య్యాడ‌ని , ప్ర‌జ‌లు ఇక‌నైనా మేల్కోవాల‌ని హెచ్చ‌రించారు. లేక పోతే రాష్ట్రంలో రాచ‌రిక , మాఫియా రాజ్యంగా మార్చేస్తాడ‌ని ద్వ‌జ‌మెత్తారు. విచిత్రం ఏమిటంటే విశాఖ ప‌ట్ట‌ణంలో రెండున్న‌ర ల‌క్ష‌ల ఎక‌రాల‌తో ఐటీ స్పేస్ తీసుకు వ‌స్తాన‌ని చెప్పాడ‌ని , అయితే విస్తీర్ణం 1,58,383 ఎక‌రాలు మాత్ర‌మే ఉంద‌న్నారు. ఆ మాత్రం తెలుసుకోక పోవ‌డం దారుణం అన్నారు చంద్ర‌బాబు నాయుడు.

Also Read : Asians Champions Trophy 2023 : చైనాను ఓడించిన భార‌త్

Leave A Reply

Your Email Id will not be published!