Chandrababu Naidu : తెలుగుదేశం పార్టీ కన్వీనర్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఆయన మరోసారి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో ప్రజా కంఠక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాల కారణంగా పంటలు కోల్పోయిన రైతులను ఆదుకోవడంలో విఫలమయ్యాడని ఆరోపించారు.
అమరావతిలో ముఖ్య నేతలతో టీడీపీ చీఫ్ టెలీ కాన్ఫరెన్స్ చేపట్టారు. ఆర్ 5 జోన్ , విద్యుత్ కోతలు, వివేకానంద రెడ్డి హత్య, తదితర అంశాలపై చర్చించారు. పేదలను మోసగించే ప్రక్రియలో భాగంగానే ఆర్ – 5 జోన్ తీసుకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, పేదలకు మధ్య గొడవలు సృష్టించేందుకే ఆర్ -5 జోన్ తీసుకు వచ్చారని ఆరోపించారు చంద్రబాబు నాయుడు. సీఆర్డే మాస్టర్ ప్లాన్ తోనే 5 శాతం పేదల భూమి గృహ నిర్మాణానికి ఉందన్నారు .
ఆనాడు 5 వేల టిడ్కో ఇళ్ల నిర్మాణం 90 శాతం పూర్తి చేశామని స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్ తోనే 5 శాతం భూమి పేదలకు కేటాయించినప్పుడు రాజధాని రైతుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని చెప్పారు. వివేకానంద రెడ్డి హత్య కేసును చూసే న్యాయవాదులకే ప్రభుత్వానికి చెందిన కేసులను అప్పగించడంలో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు నారా చంద్రాబు నాయుడు.
Also Read : Eatala Rajender
