Chandrababu Naidu : జ‌గ‌న్ జ‌నాన్ని న‌మ్మించ లేరు – బాబు

టీడీపీ చీఫ్ షాకింగ్ కామెంట్స్

Chandrababu Naidu : తెలుగుదేశం పార్టీ చీఫ్‌, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu) నిప్పులు చెరిగారు. ఆయ‌న మ‌రోసారి ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచ‌క పాల‌న సాగుతోంద‌న్నారు. 403 క్రిమిన‌ల్ కేసులు ఉన్న ఏకైక పార్టీ వైసీపీ అని ఎద్దేవా చేశారు. ప్ర‌జ‌లు భ‌య‌భ్రాంతుల‌తో బ‌తుకుతున్నార‌ని ఆవేద‌న చెందారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను గాలికి వ‌దిలి వేశార‌ని, పాల‌న అస్త‌వ్య‌స్తంగా మారింద‌ని ఆరోపించారు నారా చంద్ర‌బాబు నాయుడు.

రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో టీడీపీ పొలిట్ బ్యూరో స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఆ పార్టీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడు ప్ర‌సంగించారు. ఇవాళ‌, రేపు జ‌రిగే మ‌హానాడును జ‌య‌ప్ర‌దం చేయాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని , దానిని స‌ద్వినియోగం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఏ ఒక్క‌రూ అజాగ్ర‌త్త‌తో ఉండ కూడ‌ద‌ని , ప్ర‌తి ఒక్కరు పార్టీని ప‌వ‌ర్ లోకి తీసుకు వ‌చ్చేలా కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు.

తాను ఎంతో ప‌రిణ‌తి చెందిన రాజ‌కీయ నాయ‌కుడిన‌ని ప‌దే ప‌దే జ‌గ‌న్ రెడ్డి చెప్పుకుంటార‌ని కానీ జ‌నం ఆయ‌న‌ను న‌మ్మ‌డం లేద‌న్నారు. అరాచ‌క పాల‌న సాగిస్తున్న వైసీపీకి మంగ‌ళం పాడేందుకు రెడీగా ఉన్నార‌ని జోష్యం చెప్పారు. ఇక మాజీ మంత్రి దివంగ‌త వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసుకు సంబంధించి సీఎం జ‌గ‌న్ రెడ్డి పేరును సీబీఐ ప్ర‌స్తావించ‌డాన్ని ఈ సంద‌ర్బంగా ప్ర‌స్తావించారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ విష‌యం రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌ని, జ‌గ‌న్ న‌మ్మించ లేర‌న్నారు.

Also Read : AP TOP

Leave A Reply

Your Email Id will not be published!