Chandrababu Naidu : సిరులు పండే చోట రక్తం పారిస్తే ఎలా
నిప్పులు చెరిగిన చంద్రబాబు నాయుడు
Chandrababu Naidu : తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం జగన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సాగు నీరిచ్చి తాము సిరులు పండించాలని అనుకుంటే జగన్ రక్తం పారిస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు పడకేశాయని పేర్కొన్నారు. కోస్తాంధ్రలో టీడీపీ హయాంలో ప్రాజెక్టులపై రూ. 21,442 కోట్లు ఖర్చు చేశామన్నారు. శుక్రవారం మీడియాతో చంద్రబాబు(Chandrababu Naidu) మాట్లాడారు. ఈ నాలుగేళ్ల కాలంలో వైసీపీ ఖర్చు కేవలం రూ. 4,375 కోట్లు ఖర్చు చేసిందంటూ ఎద్దేవా చేశారు.
Chandrababu Naidu Asking
కాలువల నిర్మాణం కూడా చేపట్టలేని ప్రభుత్వం ప్రాజెక్టులను ఎలా కడుతుందంటూ ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో ఇప్పటికే వైసీపీ సర్కార్ రూ. 40 వేల కోట్లకు పైగా దోచుకుందని ఆరోపించారు. సీఎం చేతకానితనం వల్ల ప్రాజెక్టులు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదన్నారు. ఉత్తరాంధ్ర లోని నదుల అనుసంధానం కోసం సుజల స్రవంతి తీసుకు వచ్చామన్నారు.
వంశధార, నాగావళి కింద చంపావతి, గోస్తా, శారద, వరాహా, తాండవ, ఏలేరు వంటి అనేక ఉప నదులు ఉన్నాయని తెలిపారు. వీటన్నింటిని అనుసంధానం చేసేందుకు తాము ప్లాన్ చేశామని చెప్పారు.
గోదావరి నీటిని ఉత్తరాంధ్రకు తీసుకు వెళితే ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు టీడీపీ చీఫ్. నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆంబోతులా అరవడం తప్ప ఇంకేమీ చేయడంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Also Read : MP Sanjay Singh : మణిపూర్ ఈ దేశంలో లేదా మోదీ