Chandrababu Naidu : ఏపీ సీఎంపై టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)ఫైర్ అయ్యారు. ఏపీ అసెంబ్లీని వేదికగా చేసుకుని మూడు ముక్కలాటకు తెర తీశారంటూ ధ్వజమెత్తారు. మూడు రాజధానులపై జగన్ కు మాట్లాడే హక్కు లేదన్నారు.
అధికార వికేంద్రీకరణ కాదని అభివృద్ధి వికేంద్రరణ కావాలని స్పష్టం చేశారు. రాష్ట్రం పట్ల ఎలాంటి అవగాహన ఈరోజు వరకు రాలేదన్నారు. ఏపీకి ఆయన ఓ భారంగా మారారని ఆరోపించారు చంద్రబాబు నాయుడు.
నమ్మక ద్రోహానికి పాల్పడిన జగన్ కు పాలించే హక్కు లేదని మండిపడ్డారు. రాజ్యాంగ పరిధికి లోబడి పాలన సాగించాల్సి ఉంటుందన్నారు. ఎవరైనా చట్టాన్ని గౌరవించాలని సూచించారు.
ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్దతి కాదన్నారు. మోసాలు, ఘోరాలు చేయడంలో వైసీపీ చీఫ్ దిట్ట అని సంచలన ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడు. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని పెడితే అభ్యంతరం లేదన్నారు.
ఇప్పటికే 33 వేల ఎకరాలు రైతులు ఇచ్చారని చెప్పారు. వికేంద్రీకరణ అన్నది అభివృద్ధి దిశగా సాగేదిగా ఉండాలని స్పష్టం చేశారు. వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు చంద్రబాబు(Chandrababu Naidu).
ఈ అంశం ఎంతో ప్రాధాన్యతతో కూడుకుని ఉన్నదని అన్నారు. మీరు తీసుకునే నిర్ణయం, మాట్లాడే మాటలు ప్రజలపై పెను ప్రభావం పడుతుందన్నారు.
ఇది భవిష్యత్ తరాలపై కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుందన్నారు చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఆరోపించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు చట్టాలు చేయలేరని స్పష్టం చేశారు.
Also Read : టీడీపీ సభ్యులపై స్పీకర్ సీరియస్