Chandrababu Naidu : ఇంకెంత కాలం జగనన్న రాజ్యం
టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు
Chandrababu Naidu : తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. శుక్రవారం కుప్పంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ సర్కార్ పై ప్రత్యేకించి ఆ పార్టీకి చెందిన నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెంత కాలం ఈ జగన్ దోపిడీ రాజ్యాన్ని భరించాలని అన్నారు. రాష్ట్రంలో పంచ భూతాలను సైతం నేతలు మింగేశారంటూ ఆరోపించారు.
ప్రభుత్వంపై ప్రజలు స్వచ్చంధంగా తిరుగుబాటు చేసేందుకు సిద్దమయ్యారని, ఇక వైసీపీ నేతలను తరిమి కొట్టడమే మిగిలి ఉందన్నారు నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu). భయపెట్టి ఎంత కాలం ప్రభుత్వాన్ని నడిపిస్తారంటూ ప్రశ్నించారు. నియంత కిమ్ సోదరుడే ఈ సీఎం జగన్ మోహన్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. పులివెందులలో గత కొంత కాలంగా భయాందోళనకు గురి చేసి గెలుస్తూ వచ్చారని ఆరోపించారు. కానీ కుప్పంలో తాను ప్రజల అభిమానంతో విజయం సాధిస్తున్నానని అన్నారు.
హద్ హూద్ తుపానుకు భయపడని విశాఖ వాసులు వైసీపీ అక్రమాలకు వణుకుతున్నారని అన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం తన ముందున్న లక్ష్యమని ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు. నాలుగు దశాబ్దాలుగా నన్ను ప్రజలు ఆదరిస్తున్నారని, వారి రుణం తీర్చు కోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పేదలను ధనికులను చేయడం తన సంకల్పమని స్పష్టం చేశారు.
Also Read : Satya Pal Malik : సత్య పాల్ మాలిక్ షాకింగ్ కామెంట్స్