Chandrababu Naidu Tests : చంద్ర‌బాబుకు వైద్య ప‌రీక్ష‌లు

బెజ‌వాడ‌కు టీడీపీ చీఫ్ త‌ర‌లింపు

Chandrababu Naidu Tests : నంద్యాల – ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ స్కీం స్కామ్ కేసులో టీడీపీ చీఫ్‌, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును అదుపులోకి తీసుకున్నా ఏపీ సీఐడీ పోలీసులు. శ‌నివారం హై డ్రామా చోటు చేసుకుంది. టీడీపీ శ్రేణులు, కార్య‌క‌ర్త‌లు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు.

Chandrababu Naidu Tests Health

డీజీపీ ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున పోలీసుల‌ను మోహ‌రించారు. నంద్యాల‌లో విశ్రాంతి తీసుకుంటున్న నారా చంద్ర‌బాబు నాయుడు వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఆయ‌న వ్య‌క్తిగ‌త సెక్యూరిటీ సిబ్బంది అభ్యంత‌రం తెలిపారు. దీనికి సంబంధించి ఏపీ సీఐడీ పోలీసులు వివ‌ర‌ణ ఇచ్చారు. రిమాండ్ రిపోర్టు చూపించారు.

ఆ వెంట‌నే చంద్ర‌బాబు నాయుడుని అదుపులోకి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు చంద్ర‌బాబుతో సంత‌కాలు తీసుకున్నారు. అంత‌కు ముందు చంద్ర‌బాబుకు(Chandrababu Naidu) వైద్యుల ఆధ్వ‌ర్యంలో ప‌రీక్ష‌లు చేప‌ట్టారు. ఆయ‌న‌కు కొద్దిగా బీపీ పెరిగిందని, షుగ‌ర్ కూడా నార్మల్ గా ఉంద‌ని తేలడంతో హుటా హుటిన త‌ర‌లించేందుకు స్టార్ట్ చేశారు.

ముందుగా త‌మ వాహ‌నంలో రావాల‌ని ఏపీ సీఐడీ కోరింది. దీనికి నారా చంద్ర‌బాబు నాయుడు అభ్యంత‌రం తెలిపారు. త‌న వాహ‌నంలోనే వ‌స్తాన‌ని చెప్పారు. దీంతో చివ‌ర‌కు అంగీక‌రించారు . జెడ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌లో ఉన్న చంద్ర‌బాబు నాయుడును విజ‌య‌వాడ‌కు త‌ర‌లించారు.

అక్క‌డ మేజిస్ట్రేట్ ఇంటి వ‌ద్ద‌కు తీసుకు వెళ‌తారు. న్యాయ‌మూర్తి ఎదుట ప్ర‌వేశ పెడ‌తారు.

Also Read : Chandrababu Naidu : నేను ఏ త‌ప్పూ చేయ‌లేదు

Leave A Reply

Your Email Id will not be published!