Chandrababu Naidu : రాజమండ్రి జైలుకు చంద్రబాబు
భారీ భద్రత మధ్య తరలింపు
Chandrababu Naidu : రాజమండ్రి – భారీ బందోబస్తు మధ్య టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును రాజమండ్రి లోని సెంట్రల్ జైలుకు తరలించారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కీం స్కామ్ లో కీలకమైన సూత్రధారి అంటూ ఏపీ సీఐడీ ఆరోపించింది. ఈ మేరకు నంద్యాలలో నారా చంద్రబాబు నాయుడును అదుపులోకి తీసుకుంది.
Chandrababu Naidu in Rajahmundry Central Jail
అక్కడి నుంచి తాడేపల్లి గూడెంలోని కంచనపల్లికి తరలించింది. సీఐడీ ఆఫీసులో 10 గంటలకు పైగా నారా చంద్రబాబు నాయుడును(Chandrababu Naidu ) విచారించారు. విచారణలో భాగంగా 20 ప్రశ్నలు సంధించారు. కానీ ఏ ఒక్క ప్రశ్నకు బాబు సరైన సమాధానం ఇవ్వలేదు. అక్కడి నుంచి బెజవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు.
అనంతరం అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానంకు తీసుకు వచ్చారు. సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి వాదించారు. నారా చంద్రబాబు నాయుడు తరపున ఢిల్లీ నుంచి వచ్చిన ప్రముఖ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా తో పాటు ఏపీకి చెందిన వెంకటేశ్వర్ రావు వాదించారు.
ఇదే సమయంలో తనకు మాట్లాడేందుకు ఛాన్స్ ఇవ్వాలని న్యాయమూర్తి హిమ బిందును కోరారు. పొద్దు పోయాక జడ్జి సంచలన తీర్పు ప్రకటించారు. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో చంద్రబాబును జైలుకు తరలించక తప్పలేదు.
Also Read : Sajjala Ramakrishna Reddy : స్కిల్ స్కామ్ విలన్ చంద్రబాబు
