AP CID : రాజమండ్రి – ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఏపీ సీఐడీ స్కిల్ స్కాంకు సంబంధించి 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వాదోపవాదనలు విన్న కోర్టు అన్ని రోజులు ఇవ్వలేమని , కేవలం 2 రోజులు మాత్రమే ఇస్తానని జడ్జి ప్రకటించారు.
AP CID Investigation Going On
దీంతో నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) వయసు 73 ఏళ్లు. ఆరోగ్యం దృష్ట్యా ఏసీబీ కోర్టు ఆఫీసుకు పిలిపించే బదులు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలులోనే విచారించాలని కోర్టు ఆదేశించింది. ఈ స్కిల్ స్కాం కేసుకు సంబంధించి శనివారం ఏపీ సీఐడీ అత్యంత భద్రత మధ్య నారా చంద్రబాబు నాయుడును ఏకంగా 7 గంటలకు పైగా విచారించింది.
ఈ కేసులో భాగంగా మాజీ సీఎంకు 120 ప్రశ్నలు సంధించింది. దీనికి చంద్రబాబు నాయుడు నుంచి ఎలాంటి స్పందన రాలేదని సమాచారం. స్కిల్ స్కాంలో రూ. 371 కోట్ల స్కాం చోటు చేసుకుందని ప్రధాన ఆరోపణ. షెల్ కంపెనీల ద్వారా హవాలా మార్గంలో డబ్బులు చేతులు మారాయని ఆరోపించింది ఏపీ సీఐడీ.
Also Read : Mynampalli Hanumantha Rao : హరీశ్ రావు ఆటలు సాగవు