Shashikala Jolle : టిప్పు సుల్తాన్ కాలం నాటి పేర్లు మార్పు
ఆలయాల ఆచారాల పేర్లు మాత్రమే
Shashikala Jolle : కర్ణాటకలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు టిప్పు సుల్తాన్ కాలంలో ఏర్పాటు చేసిన ఆలయాలలో కొనసాగిస్తూ వస్తున్న ఆచారాల పేర్లను మార్చనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ముస్లింల ఆనవాళ్లు లేకుండా చేయాలనేది ఆ పార్టీ నిర్ణయం.
ఇందులో భాగంగా కీలక ప్రకటన చేసింది సర్కార్. ఆచారాలు సంప్రదాయం ప్రకారం కొనసాగుతాయని స్పష్టం చేసింది. అయితే ఆయా గుడులలో కొనసాగిస్తూ వస్తున్న ఆచారాలకు సంబంధించిన పేర్లను మాత్రమే మన భాష నుండి పదాలను చేర్చేందుకు మార్చ బడుతుందని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది.
ఇదిలా ఉండగా టిప్పు సుల్తాన్ 18వ శతాబ్దపు మైసూరు పాలకుడు. ఆయన కాలంలో కొనసాగిన ఆలయ ఆచారాలైన సలాం ఆరతి, సలాం మంగళారతి, దీవాటిగే సలాం వంటి పేర్లను మార్చుతామని తెలిపింది. వీటి స్థానంలో స్థానిక నామకరణాలతో మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కర్ణాటక మంత్రి శశికళ జోల్లె(Shashikala Jolle) వెల్లడించారు.
అయితే ఆచారాలను ఆపేది లేదని పేర్కొన్నారు ఆమె. దీవాటిగే సలామ్ కి దీపాతిగే నమస్కార, సలాం ఆరతికి ఆరతి నమస్కార, సలాం మనలారతికి మంగళారతి నమస్కారాలుగా నామకరణం చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఇది తమ శాఖలోని సీనియర్ ఆగమ పండితుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నామన్నారు.
ఇందులో భాగంగానే సర్క్యులర్ జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు శశికళ జోళ్లే. కర్ణాటక రాజ్య ధార్మిక పరిషత్ సమావేశంలో కొంత మంది సభ్యులు ఈ ఆచారాల పేర్లను మార్చాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారన్నారు. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు మంత్రి.
Also Read : నెలసరి’లో సెలవు ఇస్తే తప్పేంటి