Mia Love H1B : హెచ్-1బి వీసా జారీలో మార్పులు అవ‌స‌రం

యుఎస్ పొలిటిక‌ల్ వ్యాఖ్యాత మియా ల‌వ్

Mia Love H1B : అమెరికా జారీ చేసే హెచ్ -1బి వీసా(Mia Love H1B) జారీలో మార్పులు చోటు చేసుకోనున్నాయా. అవున‌నే సంకేతాలు వెలువ‌డుతున్నాయి. ప్ర‌తి ఏటా ఎక్కువ సంఖ్య‌లో జారీ చేస్తోంది ఈ వీసాల కోసం.

ఆ దేశంలోని కంపెనీల‌లో ప‌ని చేయాలంటే ఈ హెచ్ -1బి వీసా త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. మొద‌ట మూడేళ్ల పాటు ప‌ని చేయాల్సి ఉంటుంది. మ‌రో మూడేళ్ల పాటు పొడిగింపు ఉంటుంది.

ఆ త‌ర్వాత అక్క‌డే ఉండాల‌ని అనుకుంట‌నే గ్రీన్ కార్డు పొందాలి. ఇదంతా పెద్ద త‌తంగం. వీసాల జారీకి సంబంధించి ప్ర‌త్యేకంగా జ్యూరీ ఏర్పాటైంది.

ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు మాజీ రిప‌బ్లిక‌న్ పార్టీకి చెందిన నాయ‌కురాలు, రాజ‌కీయ విశ్లేష‌కురాలు, ఉటా యూనివ‌ర్శిటీ జాతీయ ఔట్రీచ్ డైరెక్ట‌ర్ మియా ల‌వ్(Mia Love H1B).

ఆమె అమెరికా జారీ చేస్తున్న హెచ్ -1బి వీసాల(Mia Love H1B) విష‌యంలో ఎలాంటి మార్పులు చేయాల‌నే దానిపై సెనేట్ జ్యూడిషియ‌రీ అభిప్రాయాలు సేక‌రిస్తోంది.

ఇందులో భాగంగా మియా ల‌వ్ త‌న అభిప్రాయాల‌ను కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. హెచ్ -1బి వీసా కోటాలో ఎలాంటి మార్పులు ఉండ‌డం లేదు. గ‌త 20 ఏళ్లుగా ఒక‌టే రీతిన మూస ప‌ద్ద‌తిలో కొన‌సాగుతోంద‌ని తెలిపారు.

అమెరికా ప్ర‌భుత్వం దేశం, స‌మాజాల అభివృద్ధి కోసం అభివృద్ధికి దోహ‌దం చేయ‌గ‌ల ఆస్తుల‌గా ప‌రిగ‌ణించాల‌ని సూచించారు మియా ల‌వ్. హెచ్ -1బి వీసా కోటాలో మార్పు లేదు.

దేశం వెనుక‌బ‌డి ఉందంటూ చ‌ట్ట స‌భ స‌భ్యులు చెప్పారు. కేవ‌లం 85,000 మాత్ర‌మే జారీ చేస్తున్నారు. ఇవి స‌రిపోవ‌డం లేద‌న్నారు. కాగా అధిక నైపుణ్యం క‌లిగిన వ‌ల‌స‌ల విస్త‌ర‌ణ ఆర్థిక వృద్ధిని పెంచుతుంద‌న్నారు.

అదే స‌మ‌యంలో అమెరిక‌న్ వ్యాపారాల‌ను విస్త‌రింప చేస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అత్యంత వెనుక‌బ‌డిన అమెరిక‌న్ల‌కు మ‌రిన్ని అవ‌కాశాలు అందిస్తుంద‌ని మియా ల‌వ్ చెప్పారు.

Also Read : పాక్ పీఎం అవినీతిపై ఆధారాలు లేవు

Leave A Reply

Your Email Id will not be published!