Channi : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైన పరాభవాన్ని మూట గట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ(Channi )పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓటమి పాలయ్యారు.
ఆయనతో పాటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ సిద్దూ కూడా పరాజయం చెందారు. దీంతో ఇవాళ చన్నీ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ కు రాజీనామా సమర్పించారు.
చివరి సారిగా సమావేశమైన చన్నీ నేతృత్వంలోని మంత్రివర్గం ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని కొత్త శాసనసభకు రాజ్యాంగానికి మార్గం సుగమం చేస్తూ అసెంబ్లీని రద్దు చేయాలని సిఫార్సు చేసింది.
తన రాజీనామా లేఖను గవర్నర్ కు అందజేసిన అనంతరం చన్నీ మీడియాతో మాట్లాడారు. సీఎం పదవికి రాజీనామా చేశా. దీనికి సంబంధించిన లేఖను గవర్నర్ కు అందజేశానని చెప్పారు.
కొత్తగా ఏర్పాటు చేయబోయే ఆప్ ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తానని స్పష్టం చేశారు చన్నీ. ఇదిలా ఉండగా మొత్తం రాష్ట్రంలో 117 సీట్లలో ఆప్ 92 సోట్లు స్వంతం చేసుకుంది.
కాంగ్రెస్ 18 స్థానాలతో సరి పెట్టుకుంది. ఆప్ దెబ్బకు అకాలీ దళ్ , బీజేపీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీలను మట్టి కరిచేలా చేసింది. బాదల్ , అమరీందర్ సింగ్ , బిక్రమ్ సింగ్ మజిథియా ఆప్ దెబ్బకు ఇంటి బాట పట్టారు.
ఇదిలా ఉండగా 1997 తర్వాత పంజాబ్ లో 92 సీట్లు సాధించి చరిత్ర సృష్టించింది. కాగా కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ఆధిపత్య పోరు ఆ పార్టీని కొంప ముంచేలా చేసింది.
Also Read : నా సోదరుడు ప్రజల ఆశల్ని తీరుస్తాడు