Chanrababu Naidu : ఏపీ స్కీం స్కామ్ లో బాబు కుట్రదారు
స్పష్టం చేసిన ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్
Chanrababu Naidu : విజయవాడ – ఏపీ సీఐడీ చీఫ్ ఎన్. సంజయ్ సంచలన ప్రకటన చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నంద్యాలలో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై స్పందించారు. ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో వివరాలు అందజేశారు.
Chanrababu Naidu Arrest Viral
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కీం కు సంబంధించి 2021 నుంచి విచారణ చేపట్టామన్నారు. పూర్తి ఆధారాలు దొరికిన తర్వాతనే చంద్రబాబును అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పారు. వైద్య పరీక్షలు చేపట్టామని, ఫ్లయిట్ లో తరలిస్తామని చెప్పగా కాదన్నారని అందుకే రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు తరలించామని తెలిపారు.
కేవలం స్కామ్ చేసేందుకే స్కీం ప్రవేశ పెట్టారని, ఎలాంటి కేబినెట్ ఆమోదం తీసుకోలేదన్నారు. రూ. 550 కోట్ల డబ్బులు షెల్ కంపెనీల ద్వారా హవాలా రూపంలో డబ్బులు చేతులు మారాయని స్పష్టం చేశారు. ఈ స్కాం స్కీమ్ లో నారా చంద్రబాబు నాయుడు(Chanrababu Naidu) ప్రధాన కుట్రదారుగా ఉన్నారని తేల్చేశారు. బాబు కన్నసన్నల మేరకే ఈ కేసు జరిగిందన్నారు.
అప్పటి మంత్రి నారా లోకేష్ కు కూడా ఇందులో పాత్ర ఉందన్నారు. ఆర్థిక కుట్రకు 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉందన్నారు. బలమైన ఆధారాలు ఉన్నందు వల్లనే తాము చంద్రబాబును అరెస్ట్ చేశామన్నారు. విచారణ చేపట్టేందుకు నారా లోకేష్ ను కూడా అదుపులోకి తీసుకుంటామన్నారు.
Also Read : Chandrababu Naidu : నేను నిప్పును ఎవరికీ భయపడను