Rana Ayyub : జ‌ర్న‌లిస్ట్ రానా అయ్యూబ్ పై ఛార్జిషీట్

కేంద్ర స‌ర్కార్, బీజేపీపై ఆగ్ర‌హం

Rana Ayyub : మ‌నీ లాండ‌రింగ్ ఆరోప‌ణ‌ల‌పై ప్ర‌ముఖ జర్న‌లిస్ట్ రానా అయ్యూబ్(Rana Ayyub) పై తాజాగా ఛార్జి షీట్ దాఖ‌లు చేసింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌. గ‌త కొన్నేళ్లుగా ఆమె భార‌తీయ జ‌న‌తా పార్టీని, ప్ర‌ధాని మోదీని, కేంద్రా స‌ర్కార్ ను విమ‌ర్శిస్తూనే వ‌స్తున్నారు. ఇదంతా త‌న‌ను కావాల‌ని ఇరికిస్తున్న కుట్ర త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని పేర్కొన్నారు.

ఈ వేధింపుల‌ను, అభియోగాల‌ను రానా అయ్యూబ్ స్మెర్ క్యాంపెయిన్ అంటూ ఎద్దేవా చేసింది. రానా అయ్యూబ్ కు చెందిన రూ. 1.77 కోట్లను కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ ఫిబ్ర‌వ‌రిలో స్తంభింప చేసింది. సాంఘిక సంక్షేమ కార్య‌క్ర‌మాల కోసం ప్ర‌జ‌ల నుంచి సేక‌రించిన నిధుల‌తో మ‌నీ లాండ‌రింగ్ కు పాల్ప‌డిందంటూ ఈడీ ఆరోపించింది.

ఈ మేర‌కు స‌మ‌ర్పించిన ఛార్జి షీట్ లో పేర్కొంది. ప్ర‌త్యేకంగా రానా గురించి ప్ర‌స్తావించింది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్ర‌భుత్వం క‌రోనా పేరుతో సేక‌రించిన వివ‌రాలు దేశానికి చెప్పాల‌ని రానా అయ్యూబ్ డిమాండ్ చేస్తున్నారు. పీఎం రిలీఫ్ ఫండ్ కు వ‌స్తున్న నిధులు ఎన్ని . అవి ఎవ‌రెవ‌రికి ఖ‌ర్చు చేస్తున్నారో చెప్పాలంటూ కోరుతున్నారు.

ఆమె దీనికి ఓ పేరు కూడా పెట్టారు కోవిడ్ ఉప‌శ‌మ‌నం అని. ఇదిలా ఉండ‌గా లాక్ డౌన్ ప్రారంభం అయ్యాక ఏప్రిల్ 2020లో క్రౌడ్ ఫండింగ్ వెబ్ సైట్ కెట్టోలో అయ్యూబ్ మూడు ప్ర‌చారాలు చేప‌ట్టారు. దాదాపు రూ. 2.69 కోట్లు వ‌సూలు చేశారంటూ ఈడీ ఆరోపించింది. ఎఫ్సీఆర్ఏ లో న‌మోదు చేయ‌కుండానే విదేశాల నుంచి డ‌బ్బులు అందుకున్నారంటూ పేర్కొంది.

సేక‌రించిన విరాళాలు తండ్రి, సోద‌రి బ్యాంకు ఖాతాలకు మ‌ళ్లించిందంటూ తెలిపింది ఈడీ. కేవ‌లం రూ. 29 ల‌క్ష‌ల‌ను మాత్ర‌మే సామాజిక సంక్షేమ ప‌నుల కోసం ఖ‌ర్చు చేసిందంటూ ఆరోపించింది.

Also Read : గుజ‌రాత్ ఆప్ చీఫ్ గోపాల్ ఇటాలియా అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!