Cheekoti Praveen Bandi Sanjay : ‘బండి’తో ‘చీకోటి’ బిజీ
దాదాపు లైన్ క్లియర్ అయినట్టే
Cheekoti Praveen Bandi Sanjay : క్యాసినో కింగ్ పిన్ గా పేరు పొందిన చీకోటి ప్రవీణ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా. ఇప్పటికే ఆయన తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమంటూ ప్రకటించారు. కానీ ఏ పార్టీలో చేరుతారనేది సస్పెన్స్ లో ఉంచారు. తాజాగా ఉన్నట్టుండి చీకోటి ప్రవీణ్ ఢిల్లీలో ప్రత్యక్షం అయ్యాడు. కరీంనగర్ ఎంపీ , తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ , ప్రస్తుత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) ను కలిశాడు. వాళ్లిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్న ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
Cheekoti Praveen Bandi Sanjay Meet
ఇక అటు ఏపీలో ఇటు తెలంగాణలో చోటు చేసుకున్న క్యాసినో వ్యవహారానికి సంబంధించిన కేసులో కీలకమైన సూత్రధారిగా ఉన్నారు చీకోటి ప్రవీణ్. ఆ మధ్యన సింగపూర్ లో కూడా అరెస్ట్ అయ్యాడు. తర్వాత తెలివిగా వారి నుంచి బయట పడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సైతం చీకోటి ప్రవీణ్ ను విచారించింది. ఆపీసుకు కూడా పిలిపించింది.
క్యాసినో కేసులో ప్రధాన నిందితుడిగా ఉండడం విశేషం. ఇవాళ హస్తినలో భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖులను కలుసుకున్నారు. తాను బీజేపీలో చేరాలని అనుకుంటున్నట్లు చెప్పారని, కానీ కేసులో నిందితుడిగా ఉన్న చీకోటిని చేర్చుకుంటే పార్టీపై దుష్ప్రభావం పడే అవకాశం ఉందని ఆలోచనలో బండి ఉన్నట్లు టాక్.
Also Read : Bandi Sanjay Modi : మోడీని కలిసిన బండి కుటుంబం