Cheetah TTD : తిరుమలలో ఎట్టకేలకు చిక్కిన చిరుత
అలిపిరి దారిలో చిన్నారి ఘటన
Cheetah TTD : తిరుమల అలిపిరి దారి నడకలో చిన్నారి లక్షితను చంపిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది(Cheetah TTD). రెండు రోజుల కిందట శ్రీనివాసుడిని దర్శించు కునేందుకు దారి నడకన వెళుతున్న లక్షితను దాడి చేసి చంపింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. నిత్యం వేలాది మంది స్వామి , అమ్మ వార్లను దర్శించు కునేందుకు వస్తుంటారు. కొందరు అలిపిరి నడక దారిన వెళితే మరికొందరు భక్తులు శ్రీవారి మెట్ల నుంచి తిరుమలకు వెళతారు.
Cheetah TTD Viral
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భద్రతను కట్టుదిట్టం చేసినా చివరకు చిన్నారి ప్రాణాన్ని కాపాడలేక పోయారు. ఈ ఘటన తిరుమలలో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యాన్ని ఎత్తి చూపింది. దీంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. అడవిని గాలించారు. చివరకు మరోసారి మనుషుల రక్తం మరిగిన చిరుత వస్తుందని గుర్తించారు. ఇందుకు సంబంధించి చిరుత దాడి చేసిన ప్రాంతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో బోను ఏర్పాటు చేశారు.
ఉన్నట్టుండి మరోసారి చిరుత అటు వైపు వచ్చింది. బోనులో ఆదివారం అర్ధరాత్రి చిక్కింది. ప్రస్తుతం బోనులో చిక్కిన చిరుతను తరలించేందుకు అటవీ శాఖ , టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలా ఉండగా చిన్నారి లక్షిత కుటుంబానికి టీటీడీ, అటవీ శాఖ తరపున రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా కింద సాయం చేస్తున్నట్లు ప్రకటించారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.
Also Read : Rajinikanth Comment : సింప్లిసిటీ తలైవా చోదక శక్తి