Cheruku Sudhakar : తెలంగాణ గుండె చప్పుడు బీఆర్ఎస్
డాక్టర్ చెరుకు సుధాకర్ కామెంట్
Cheruku Sudhakar : హైదరాబాద్ – తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. ఈ తరుణంలో అధికారంలో కొలువు తీరిన భారత రాష్ట్ర సమితి పార్టీకి వలసలు పెరిగాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి కూడా జంపింగ్ అవుతున్నారు నేతలు.
Cheruku Sudhakar Comments Viral
తాజాగా ఇంటి పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ చెరుకు సుధాకర్ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన గతంలో తెలంగాణ ఉద్యమ కాలం నుంచీ కీలకంగా వ్యవహరించాడు. సీఎం కేసీఆర్ తో కలిసి నడిచారు. ఎన్నో సందర్బాలలో పాలు పంచుకున్నారు.
ఆ తర్వాత సీఎంతో విభేదించారు. ఎన్నో ప్రజా ఉద్యమాలలో పాలు పంచుకున్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. కానీ అక్కడా ఇముడ లేక పోయారు. చివరకు బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. ఆయన మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్వర్ రెడ్డి సమక్షంలో గులాబీ జెండా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ చెరుకు సుధాకర్(Cheruku Sudhakar) మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గుండె చప్పుడు అని స్పష్టం చేశారు. తాను పార్టీ మారడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తంగా పలు పార్టీల నుంచి జంప్ అయిన వారంతా చెబుతున్నదంతా విచిత్రంగా ఉంటోంది.
Also Read : AP CM YS Jagan Wishes : ఏపీ సీఎం దసరా శుభాకాంక్షలు