Amit Shah Chhatrapati Shivaji : ఛత్రపతి ఈ దేశానికి నిత్య స్పూర్తి
శివాజీ థీమ్ పార్క్ కు అమిత్ షా శ్రీకారం
Amit Shah Chhatrapati Shivaji : ఛత్రపతి శివాజీ మహరాజ్ ఈ దేశానికి నిత్య స్పూర్తి కలిగించే నాయకుడని కొనియాడారు కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. మరాఠా యోధుడి జయంతి ఇవాళ. ఆదివారం పూణే లోని అంబేగావ్ లో మరాఠా రాజు శివాజీ మహరాజ్ థీమ్ పార్క్ కు సంబంధించి శివ సృష్టి మొదటి దశను కేంద్ర మంత్రి ప్రారంభించారు.
మహారాష్ట్రలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు మరాఠా సామ్రాజ్య చరిత్రకు అంకితం చేయబడింది. ఇది ఆసియా లోనే అతి పెద్ద థీమ్ పార్క్ అవుతుందని అన్నారు అమిత్ షా. రాష్ట్ర ప్రభుత్వం రూ. 60 కోట్లతో ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేసింది.
ఈ థీమ్ పార్క్ కు శివ సృష్టి అని పేరు పెట్టారు. ఈ థీమ్ పార్క్ లో మరాఠా రాజు ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రకు సంబంధించిన అన్ని అంశాలను ప్రదర్శిస్తారు. శివాజీ జీవితంపై లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. తొలి దశ ప్రారంభోత్సవానికి సీఎం ఏక్ నాథ్ షిండేతో పాటు డిప్యూటీ సీఎం అమిత్ షా హాజరయ్యారు. ఆనాటి మొఘల్ చక్రవర్తులకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్ అని కొనియాడారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah Chhatrapati Shivaji).
వారిని ధైర్యంగా ఎదుర్కొన్న యోధుడన్నారు. భావి తరాలకు ఈ థీమ్ పార్క్ తో ఆయన జీవిత చరిత్రపై చక్కని అవగాహన లభిస్తుందన్నారు అమిత్ షా. ఈ చారిత్రక థీమ్ పార్క్ పద్మ భూషణ్ అవార్డు గ్రహీత దివంగత శివ షాహిర్ బాబా సాహెబ్ పురందరరే ఆలోచనల్లోంచి పుట్టుకు వచ్చింది. ఈ సందర్భంగా ఆయన కృషిని ప్రశంసించారు కేంద్ర మంత్రి.
Also Read : దేశానికి స్పూర్తి ఛత్రపతి శివాజీ – మోదీ