CJI DY Chandrachud : కూతుళ్లకు పనితీరుపై సీజేఐ వివరణ
విస్తు పోయిన ప్రధాన న్యాయమూర్తులు
CJI DY Chandrachud : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్(CJI DY Chandrachud) గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన అత్యంత నిబద్దత కలిగిన న్యాయమూర్తిగా పేరు పొందారు. పని పట్ల అంకితభావం, ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం కలిగి ఉన్నారు. అందుకే ఆయన సీజేఐగా కొలువు తీరాక కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.
దేశంలో ఆయన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో సంచలన తీర్పులు వెలువరించారు. ప్రజాస్వామ్యానికి న్యాయ వ్యవస్థ కన్ను లాంటిదని పేర్కొంటారు. తాజాగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సీజేఐ ధనంజయ చంద్రచూడ్ కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారిని ఇవాళ ఆయన తనతో పాటే తీసుకు వచ్చారు.
కోర్టులో తాను ఏం చేస్తున్నాననో, తన పనితీరు ఎల ఉంటుందో, ఎలా తీర్పులు వెలువరిస్తామో , తదితర విషయాల గురించి కూతుళ్లకు తెలియ చేశారు సీజేఐ. ఆయన ఉద్యోగులు ఎవరెవరు ఉంటారు, న్యాయమూర్తులు ఎవరు , వారి పని విధానం ఎలా ఉంటుంది, రోజూ వారీ తాము ఎన్ని కేసులను పరిగణలోకి తీసుకుంటామనేది వారికి తెలియ చేశారు సీజేఐ(CJI DY Chandrachud).
జస్టిస్ చంద్రచూడ్ కూతుళ్లను తీసుకుని రావడంతో అక్కడే ఉన్న ప్రధాన న్యాయమూర్తులు విస్తు పోయారు. అయితే దీనికి వివరణ ఇచ్చుకున్నారు సీజేఐ. తన పిల్లలు కోర్టును చూడాలని గత కొంత కాలం నుంచి కోరుతున్నారని, అందుకే ఇవాళ వారిని తీసుకు వచ్చానని చెప్పారు. మొత్తంగా సీజేఐ మరోసారి వార్తల్లో నిలిచారు.
Also Read : వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ మీట్