Elon Musk : ప్రపంచ దిగ్గజ కుబేరుడిగా పేరొందిన టెస్లా సిఇఓ ఎలోన్ మస్క్(Elon Musk) రోజు రోజుకు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ప్రత్యర్థులు విస్తు పోయేలా చేస్తున్నారు.
ఆయన సోషల్ మీడియాను షేక్ చేస్తూ వస్తున్న మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ ను 44 బిలియన్ల కు కొనుగోలు చేశాడు. దీంతో ట్విట్టర్ లో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. ట్విట్టర్ కు సిఇఓగా ప్రవాస భారతీయుడు పరాగ్ అగర్వాల్ ఉన్నాడు.
ట్విట్టర్ ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలంటే ఇంకా ఆరు నెలలు పడుతుందని, అంత వరకు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని పేర్కొన్నాడు.
ఇదే క్రమంలో ఎలోన్ మస్క్ (Elon Musk)అభిమానులు కొందరు ట్విట్టర్ ఫీడ్ ద్వారా సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లో భవిష్యత్తులో తమకు ఉపాధి కల్పించాలని కోరుతున్నారు.
ట్విట్టర్ లో మస్క్ ని ట్యాగ్ చేసిన పోస్టులో ట్విట్టర్ లో వైస్ ప్రెసిడెంట్ గా చాన్స్ ఇవ్వాలని నికితా బీర్ కోరారు. నేను 11 ఏళ్లుగా సోషల్ మీడియా యాప్ లు రూపొందిస్తున్నానని చాన్స్ ఇవ్వాలంటూ విన్నవించడం విశేషం.
ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు చర్చల సమయంలో ఎలోన్ మస్క్ బ్యాంకర్లతో మాట్లాడారు. సోషల్ మీడియా కు సంబంధించిన బాటమ్ లైన్ పై తాను ఫోకస్ పెట్టానని తెలిపారు.
ఖర్చులు, ఉద్యోగాలు తగ్గించేందుకు నిర్దిష్ట ప్రతిపాదనలు చేయాలని సూచించాడు ఎలోన్ మస్క్. ఇక రెగ్యులేటరీ ఫైలింగ్ లో మస్క్ కంపెనీ నాయకత్వంపై తనకు నమ్మకం లేదని పేర్కొన్నాడు.
ప్రస్తుతం సిఇఓగా ఉన్న పరాగ్ అగర్వాల్ గుడ్ బై చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మస్క్ జీ చీఫ్ లవ్ ఆఫీసర్ పదవికి ట్విట్టర్ లో నా అధికారిక ఉద్యోగ దరఖాస్తు చేస్తున్నానని చాన్స్ ఇవ్వమంటూ ఫ్రిడ్ మాన్ ట్విట్ట్ లో కోరాడు.
Also Read : ఊపిరి ఉన్నంత వరకు దేశం కోసమే