Udhayanidhi Stalin : ఇక నుంచి ‘మినిష్టర్’ ఉదయనిధి స్టాలిన్
తండ్రికి తోడుగా కేబినెట్ లోచేరిన తనయుడు
Udhayanidhi Stalin : అంతా ఊహించనట్టు గానే తమిళనాడు కేబినెట్ లో మంత్రిగా కొలువు తీరారు కరుణానిధి వారసుడు, సీఎం ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin). ఆయన చేపాక్ – తిరువల్లికేణి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించాడు ఉదయనిధి స్టాలిన్.
యూత్ ను చేరదీయడంలో వారిని ఒక చోటుకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. గత కొంత కాలం నుంచీ ఉదయనిధి స్టాలిన్ ను మంత్రివర్గంలోకి చేర్చు కోవాలంటూ యువతీ యువకులు పెద్ద ఎత్తున కోరుతున్నారు. ప్రధానంగా డీఎంకే నుంచి. ప్రస్తుతం ప్రజా పాలన అందించడమే తమ ముందున్న లక్ష్యమని ఇప్పటికే ప్రకటించారు సీఎం ఎంకే స్టాలిన్.
దీంతో తనకు నమ్మకస్తుడిగా, అంతకంటే కొడుకుగా సక్సెస్ ఫుల్ నాయకుడిగా పేరొందిన ఉదయినిధి స్టాలిన్ కు ఎట్టకేలకు మినిష్టర్ గా చోటు కల్పించారు సీఎం. ఆయనకు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. బుధవారం ఉదయం జరిగిన అధికారిక కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
అటు మాస్ ఇటు యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది తనయుడికి. రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో డీఎంకే యువజన విభాగం కార్యదర్శిగా ఉన్న ఉదయినిధి స్టాలిన్ తో గవర్నర్ ఆర్. ఎన్. రవి ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక ఉదయనిధి స్టాలిన్ కు 45 ఏళ్లు. 2019లో యువజన విభాగం కార్యదర్శిగా నియమితులయ్యాడు.
Also Read : ఛాన్సలర్ గా కేరళ గవర్నర్ తొలగింపు