China Offers Sri Lanka : శ్రీలంకకు చైనా రుణ సహాయం
రెండో మారటోరియంకు జిన్ పింగ్ ఓకే
China Offers Sri Lanka : తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టు మిట్టాడుతున్న శ్రీలంకకు ఊపిరి పోసింది చైనా. ఈ మేరకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నట్లు తెలిపింది.రెండేళ్ల రుణ మారటోరియంను అందజేసేందుకు ఓకే చెప్పింది. 10 ఏళ్ల రుణ మారటోరియం, 15 ఏళ్ల రుణ పునర్ నిర్మాణానికి సంబంధించిన రుణ స్థిరత్వ విశ్లేషణ ప్రకారం ఐఎంఎఫ్ విస్తరించిన ఫండ్ సదుపాయం కోసం భారత దేశం శ్రీలంకకు బేషరతుగా మద్దతు ఇచ్చింది. చైనా కేవలం 2 సంవత్సరాలకే ఆమోదం తెలుపుతున్నట్లు ప్రకటించింది.
శ్రీలంకకు భారత్ బేషరతుగా బహిరంగంగా మద్దతు తెలిపింది. అయితే చైనా మాత్రం కేవలం 2022, 2023 సంవత్సరాలకు మాత్రమే శ్రీలంకకు భరోసా ఇచ్చింది. ఇక ఐఎంఎఫ్ పారిస్ క్లబ్ శ్రీలంక(China Offers Sri Lanka) రుణాలపై 10 సంవత్సరాల మారటోరియం , రుణ పునర్ నిర్మాణం కోసం 15 ఏళ్ల వ్యవధిని ప్రతిపాదించిందని , చైనా ఎగుమతి, దిగుమతి బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ జాంగ్ వెంకాయ్ శ్రీలంక అధ్యక్షుడు రణిలె విక్రమసింఘే ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా తెలియ చేశారు.
కొలంబో నుండి వచ్చిన అభ్యర్థన ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. దీని ప్రకారం ఆ రెండేళ్లకు సంబంధించి అసలు, వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు.
మధ్యస్థ, దీర్ఘకాలిక రుణ చికిత్సకు సంబంధించి కొలంబోతో చర్చల ప్రక్రియను వేగవంతం చేయాలని బ్యాంక్ కోరుకుంటోందని స్పష్టం చేశారు. 2023లో రాబోయే నెలల్లో రుణాన్ని ఖరారు చేసే ఉద్దేశంతో నాలుగేళ్లలో చెల్లించాల్సి ఉంటుంది. ఒక రకంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీలంకకు తీపికబురు చెప్పింది చైనా(China Offers Sri Lanka).
Also Read : భారత దేశం తప్పేమీ లేదు – అకెర్ మాన్