China Military Drills : చైనా క‌న్నెర్ర తైవాన్ పై సైనిక ప‌హ‌రా

క‌మ్ముకుంటున్న యుద్ధ మేఘాలు

China Military Drills : అమెరికా స్పీక‌ర్ నాన్సీ పెలోసీ ప‌ర్య‌టించిన అనంత‌రం తైవాన్ పై క‌న్నెర్ర చేసింది డ్రాగ‌న్ చైనా(China Military Drills) . దీంతో తైవాన్ చుట్టూ అతి పెద్ద సైనిక క‌స‌ర‌త్తులు చేయ‌నుంది.

ఈ ద్వీపాన్ని త‌న భూభాగంగా భావిస్తోంది డ్రాగ‌న్. తైవాన్ లో గ‌నుక నాన్సీ కాలు మోపితే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది చైనా.

కానీ డ్రాగ‌న్ చేసిన హెచ్చ‌రిక‌ల‌ను బేఖాత‌ర్ చేసింది అమెరికా. బేష‌ర‌తుగా తైవాన్ లో కాలు మోపారు నాన్సీ పెలోసీ. ఆపై ఆ దేశానికి సంపూర్ణ మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఆమె వెనుదిరిగిన వెంట‌నే చైనా రంగంలోకి దిగింది. సైనిక చ‌ర్య‌కు శ్రీ‌కారం చుట్టేందుకు స‌న్నాహాలు చేస్తోంది. గురువారం ఏకంగా తైవాన్ ను చుట్టు ముట్టాయి సైనిక బ‌ల‌గాలు. ఈ మేర‌కు సైనిక విన్యాసాలు ప్రారంభించింది.

ఇదిలా ఉండ‌గా 25 ఏళ్ల త‌ర్వాత అమెరికాకు చెందిన స్పీక‌ర్ సంద‌ర్శించ‌డం ఇదే మొద‌టిసారి. అమెరికాలో దేశ అధ్య‌క్షుడు, ఉపాధ్య‌క్షుడి ప‌ద‌వి త‌ర్వాత కీల‌క‌మైన ఉన్న‌త ప‌ద‌వి స్పీక‌ర్ దే.

తైవాన్ చుట్టూ ఉన్న స‌ముద్రాల‌లో సైనిక క‌స‌ర‌త్తుల‌కు శ్రీ‌కారం చుట్టింది. ప్రపంచంలోని అత్యంత ర‌ద్దీ జ‌ల‌మార్గాల‌లో కొన్ని. 12 మైళ్ల లోపు క్షిప‌ణ‌లు కూడా ప్ర‌యోగించే అవ‌కాశం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది.

అవి తైవాన్ మీదుగా ఎగురుతాయ‌ని అంచ‌నా. ఇదిలా ఉండ‌గా తైవాన్ కు చెందిన అధికారిక వెబ్ సైట్ హ్యాక్ కు గురి కావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

యావ‌త్ ప్ర‌పంచం చైనా దూకుడు త‌గ్గంచు కోవాల‌ని సూచిస్తోంది.

Also Read : చైనా దూకుడుపై తైవాన్ క‌న్నెర్ర‌

Leave A Reply

Your Email Id will not be published!