CDS Anil Chauhan : త్రివిధ దళాధిపతి రాకతో చైనా అలర్ట్
అనిల్ చౌహాన్ ప్రమాణ స్వీకారంతో అప్రమత్తం
CDS Anil Chauhan : డ్రాగన్ చైనా ఇప్పుడు అప్రమత్తమైంది. ప్రధానంగా భారత్, చైనా దేశాల మధ్య గత కొంత కాలంగా సరిహద్దు వివాదం కొనసాగుతూ వస్తోంది. ప్రతి దానికి కయ్యానికి కాలు దువ్వుతూ వస్తోంది చైనా.
దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది భారత్. ఇదే సమయంలో గత 9 నెలల కిందట త్రివిధ దళాధిపతిగా ఉన్న జనరల్ బిపిన్ రావత్ తమిళనాడులో జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ఉన్నంత వరకు చైనా కామ్ గా ఉన్నది. ఎందుకంటే మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ అధికారిగా ఆయనకు పేరుంది.
ఇదే క్రమంలో జనరల్ రావత్ మరణం తర్వాత ఏ ఒక్కరినీ చీఫ్ ఆఫ్ డిఎన్స్ సర్వీసెస్ (సీడీఎస్ ) (CDS Anil Chauhan) పోస్ట్ భర్తీ చేయకుండా ఉండింది. కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి మొదటిసారిగా త్రివిధ దళాధిపతి గా పదవీ విరమణ పొందిన అనిల్ చౌహాన్ ను సీడీఎస్ గా నియమించింది. భారత దేశంలోనే ఇది అత్యున్నతమైన పదవి.
దేశానికి సంబంధించినంత వరకు త్రివిధ దళాలకు ఆయనే చీఫ్. ప్రపంచంలో అతి పెద్ద సైనిక బలగాలకు పెట్టింది పేరు భారత్. ఈ దేశానికి ప్రాతినిధ్యం వహించడమంటే మామూలు విషయం కాదు.
ప్రస్తుతం చైనా వేచి చూసే ధోరణిని అవలంభిస్తోంది. ప్రధానంగా అనిల్ చౌహాన్ మామూలోడు కాదు. చైనా సాయం పొందుతూ భారత్ లో పక్కలో బల్లెంలా తయారైన పాకిస్తాన్ ఆర్మీ కూడా అప్రమత్తమైంది. ఎందుకంటే ఎక్కడా తగ్గని మనస్తత్వం తాజా సీడీఎస్ ది.
ఆయన సారథ్యంలో భారత్ ఆర్మీ తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దంగా ఉందని ఇప్పటికే ప్రకటించింది. ఇక ఎంత మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని ఇప్పటికే ప్రకటించారు అనిల్ చౌహాన్. ప్రత్యేకించి చైనాను ఎలా ఎదుర్కోవాలో, ఎలా నివారించాలో ఆయనకు బాగా తెలుసు.
Also Read : రష్యాపై ఓటింగ్ లో భారత్ గైర్హాజరు