Wang Yi : కలిసి సాగుదాం ఆదర్శంగా నిలుద్దాం
భారత దేశానికి డ్రాగన్ చైనా ఆహ్వానం
Wang Yi : దూకుడు మీదున్న డ్రాగన్ చైనా తన స్వరాన్ని మార్చుకుంది. నిన్నటి దాకా రంకెలు వేస్తూ అరుణాచల్ ప్రదేశ్ లోని తువాంగ్ సరిహద్దు వద్ద భారత సైనికులతో దాడులకు దిగిన చైనా ఉన్నట్టుండి కీలక ప్రకటన చేసింది. ఇరు దేశాల మధ్య గొడవలు మంచిది కాదని, కలిసి సాగుదామని పిలుపునిచ్చింది.
ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ(Wang Yi) కీలక ప్రకటన చేశారు. ప్రపంచంలోనే రెండు దేశాలు అత్యంత బలమైనవిగా మారాయని, ఈ తరుణంలో ఇచ్చి పుచ్చుకునే ధోరణితో కొనసాగాలని ఘర్షణ వాతావరణం ఇరు దేశాలకు మంచిది కాదని స్పష్టం చేశారు. తాము భారత్ తోతో స్నేహం చేసేందుకు ఆసక్తితో ఉన్నామని అన్నారు.
రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు విదేశాంగ శాఖ మంత్రి. సరిహద్దు వద్ద స్థిరమైన సంబంధం అవసరం. ఇందు కోసం ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు.
బీజింగ్ లో జరిగిన అంతర్జాతీయ పరిస్థితి చైనా విదేశీ సంబంధాలు 2022 పేరుతో నిర్వహించిన సమావేశానికి వాంగ్ యీ(Wang Yi) ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తాము ఏ దేశంతోనూ ఘర్షణ పూరిత వాతావరణాన్ని కలిగి ఉండాలని కోరుకోవడం లేదన్నారు. ఆయన మరో విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్ తమకు మిత్ర దేశమని అన్న వాంగ్ యీ ..అమెరికాపై విరుచుకు పడ్డారు. ఆ దేశం తమను పోటీదారుగా చూస్తోందన్నారు. అందుకే ప్రతీసారి అణిచి వేయాలని అనుకుంటోందన్నారు. కానీ ఆ దేశానికి తెలుసు తమతో పెట్టుకుంటే ఏం జరుగుతుందోనని అని హెచ్చరించారు వాంగ్ యీ.
Also Read : మంచు తుఫాను దెబ్బకు అమెరికా విలవిల