China Ship Heads : లంకలో చైనా నౌక..భారత్ ఆందోళన
కయ్యానికి కాలు దువ్వుతున్న డ్రాగన్
China Ship Heads : ఓ వైపు భారత సరిహద్దులో నిత్యం కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా శ్రీలంకను స్థావరంగా చేసుకుని ఉద్రిక్తతలు పెంచేలా చేస్తోంది. ఇప్పటికే తైవాన్ విషయంలో దూకుడు పెంచిన చైనా ఇప్పుడు లంకకు సాయం పేరుతో పట్టు పెంచుకునేందుకు ప్లాన్ చేస్తోంది.
తాజాగా చైనాకు చెందిన యువాన్ వాంగ్ నౌక లంక(China Ship Heads) నౌకాశ్రయానికి చేరుకుంది. ఇందులో బాలిస్టిక్ క్షిపణులు, ఉపగ్రహాలను ట్రాక్ చేసే చైనా నౌక భారత్ లో భద్రతా పరమైన ఆందోళనలను లేవనెత్తింది.
యుఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ సందర్శరనతో ప్రారంభమైన తైవాన్ తీరంలో మోహరించిన బలగాలతో సమానంగా ఉంది ఈ చర్య. యువాన్ వాంగ్ క్లాస్ షిప్ ఆగస్టు 11 లేదా 12న హంబన్ తోట పోర్ట్ కి చేరుతుందని భావిస్తున్నారు.
400 మంది సిబ్బందితో కూడిన ఈ నౌకలో పారా బిలిక్ ట్రాకింగ్ యాంటెన్నా, వివిధ సెన్సార్లు ఉన్నాయి. హిందూ మహా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోహరిస్తే ఒడిశా తీరంలోని వీలర్ ద్వీపం నుడి ఈ నౌక భారత దేశానికి చెందిన క్షిపణి పరీక్షలను పర్యవేక్షిస్తుంది.
భారత్ బాలిస్టిక్ క్షిపణి పరీక్షలను ట్రాక్ చేయడం ద్వారా చైనా క్షిపణుల పనితీరు , వాటి ఖచ్చితమైన పరిధిపై సమాచారాన్ని సేకరించగలదు. కాగా అణు రహిత ప్లాట్ ఫారమ్ కావడంతో నౌకను అనుమతిస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం తెలిపింది.
హిందూ మహా సముద్రంలో నిఘా, నావిగేషన్ కోసం తమ నౌకను పంపుతున్నట్లు చైనా తమకు సమాచారం ఇచ్చిందన్నారు శ్రీలంక రక్షణ మంత్రిత్వ శాఖ మీడియా ప్రతినిధి కల్నల్ నలిన్ హెరాత్ వెల్లడించారు.
Also Read : తైవాన్ పై చైనా ‘క్షిపణుల’ ప్రయోగం