Karti Chidambaram : సీబీఐ కేసు బోగస్ – కార్తీ చిదంబరం
కావాలని కుట్ర పన్నారంటూ ఫైర్
Karti Chidambaram : వీసా పొందడంలో తాను ఒక్క చైనా జాతీయుడికి కూడా ఎలాంటి వెసులుబాటు కల్పించ లేదని మరోసారి స్పష్టం చేశారు
మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం.
కార్తీ చిదంబరాన్ని బ్రిటన్, యూరప్ నుంచి పర్మిషన్ తీసుకుని అక్కడికి వెళ్లిన 16 గంటల్లో సీబీఐ విచారణలో పాల్గొనాలని ప్రత్యేక కోర్టు
ఆదేశించింది. దీనిపై కార్తీ చిదంబరం స్పందించారు.
ఇదంతా కావాలని కేంద్రం ఆడుతున్న కుట్రలో భాగమని కార్తీ చిదంబరం(Karti Chidambaram) ఆరోపించారు. ఈ కేసును బోగస్ కుట్ర కేసుగా అభివర్ణించారు.
చైనా వీసా కుంభకోణం కేసులో విచారణలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం గురువారం సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఎదుట హాజరయ్యారు.
కార్తీ చిదంబరం 2011లో తన తండ్రి పి. చిదంబరం హోం శాఖ మంత్రిగా ఉన్న సమయంలో 263 మంది చైనా పౌరులకు వీసాలు మంజూరు చేయించారని, ఇందుకు ప్రతిఫలంగా లంచం తీసుకున్నారంటూ సీబీఐ ఆరోపణలు చేసింది.
ఈ మేరకు కేసు కూడా నమోదు చేసింది. తనపై నమోదైన ప్రతి కేసు బోగస్ అని మండిపడ్డారు. ఢిల్లీ లోని సీబీఐ ప్రధాన కార్యాలయం
వెలుపల కార్తీ చిదంబరం మీడియాతో మాట్లాడారు.
వీసా పొందడంలో ఒక్క చైనీస్ కు చాన్స్ ఇవ్వలేదన్నారు. ఇదిలా ఉండగా కేసుకు ముందు ఈనెల 17న ఈ కేసులో కార్తీ చిదంబరం(Karti Chidambaram) సన్నిహితుడిగా పేరొందిన ఎస్. భాస్కర్ రామన్ ను సీబీఐ అరెస్ట్ చేసింది.
అంతే కాకుండా పంజాబ్ లో పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్న వేదాంత గ్రూప్ కంపెనీ తల్వాండి సాబో పవర్ లిమిటెడ్ (టీఎస్పీఎల్)
టాప్ ఎగ్జిక్యూటివ్ నుండి రూ. 50 లక్షలు లంచంగా తీసుకున్నట్లు కార్తీ చిదంబరంపై ఆరోపణలు వచ్చాయి.
పవర్ ప్రాజెక్టును అమలు చేస్తున్న చైనా కంపెనీకి చెందిన 263 మంది చైనా కార్మికులకు ప్రాజెక్టు వీసాల రీ ఇష్యూసన్ కోసం కంపెనీ లంచం చెల్లించిందని సీబీఐ పేర్కొంది. చైనా వీసా కుంభకోణం కేసులో ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది.
Also Read : అఖిలేష్ కామెంట్స్ యోగి సీరియస్