China Ballistic Missiles : తైవాన్ పై చైనా ‘క్షిప‌ణుల’ ప్ర‌యోగం

యుద్దం కోరుకోం త‌ప్ప‌నిస‌రైతే సిద్ధం

China Ballistic Missiles : అమెరికా చేసిన నిర్వాకానికి ఇప్పుడు తైవాన్ త‌గిన మూల్యం చెల్లించుకుంటోంది. తైవాన్ త‌మ దేశంలో అంత‌ర్భాగం అంటోంది చైనా. కాద‌ని తాము స్వ‌తంత్రమ‌ని కుండ బ‌ద్ద‌లు కొడుతోంది తైవాన్.

ప్ర‌స్తుతం యావ‌త్ ప్ర‌పంచాన్ని విస్తు పోయేలా చేస్తోంది చైనా అనుస‌రిస్తున్న తీరుపై. కానీ ప్ర‌శాంతంగా ఉన్న స‌మ‌స్య‌ను ఉన్న‌ట్టుండి గెలికింది మాత్రం అమెరికానే.

వివాదాస్ప‌దంగా మారిన తైవాన్ స‌మ‌స్య తేలేంత దాకా ఏ దేశ‌మూ అక్క‌డ అడుగు పెట్ట కూడ‌ద‌ని కోరుకుంటోంది చైనా. ఇదే విష‌యాన్ని యుఎన్ తో పాటు ఇత‌ర దేశాల‌కు స్ట్రాంగ్ మెస్సేజ్ ఇచ్చింది.

కానీ చైనా ఆదేశాల‌ను బేఖాత‌ర్ చేస్తూ క‌య్యానికి కాలు దువ్వేలా చేసింది అమెరికా. ఆ దేశానికి చెందిన స్పీక‌ర్ నాన్సీ పెలోసీ తైవాన్ పై కాలు మోపారు.

ఆమె వెళ్లిన కొద్ది సేప‌ట్లోనే చైనా ప్ర‌క‌టించిన విధంగా తైవాన్ చుట్టూ పోలీసు బ‌ల‌గాల‌ను మోహ‌రించింది. అంతే కాదు అవ‌స‌ర‌మైతే మూకుమ్మ‌డి దాడి చేసేందుకు రెడీ అయ్యింది.

కాగా తాము యుద్దాన్ని కోరుకోవ‌డం లేద‌ని తైవాన్ తో కేవ‌లం స్నేహం మాత్ర‌మే కోరుకుంటున్నామంటోంది అమెరికా. త‌మ ఆదేశాల‌ను లెక్క చేయ‌ని అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది చైనా.

అవ‌స‌ర‌మైతే నీపై కూడా యుద్దానికి రెడీ అంటోంది. ఈ త‌రుణంలో చైనా(China Ballistic Missiles) ఉన్న‌ట్టుండి రంగంలోకి దిగ‌డం, సైనిక క‌స‌ర‌త్తులు చేయ‌డం ప్రారంభించింది. తైవాన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

21 ఫైట‌ర్ జెట్ ల‌ను ప్ర‌యోగించింది. కానీ తైవాన్ మాత్రం త‌మ‌పై బాలిస్టిక్ క్షిప‌ణ‌లు ప్ర‌యోగించింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. యుద్ధ నౌక‌ల‌ను మోహ‌రించింద‌టూ వాపోయింది.

ద్వీపం తీరానికి కేవ‌లం 20 కిలోమీట‌ర్ల దూరంలో వీటిని ఏర్పాటు చేసింది చైనా.

Also Read : క‌నిపించ‌ని అల్ జ‌వ‌హిరి ఆన‌వాళ్లు

Leave A Reply

Your Email Id will not be published!