Chinna Jeeyar Swamy : ప్రాతః స్మ‌ర‌ణీయుడు రామానుజుడు

శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి చినజీయ‌ర్ స్వామి

Chinna Jeeyar Swamy  : నిత్య ప్రాతః స్మ‌ర‌ణీయుడు రామునుజుడు అన్నారు త్రిదండి శ్రీ‌మ‌న్నారాయ‌ణ చిన జీయ‌ర్ స్వామి. మ‌నుషులంతా ఒక్క‌టేన‌ని ఆనాడే చాటి చెప్పిన మ‌హ‌నీయుడ‌ని అన్నారు.

రేప‌టి నుంచి 14 వ‌ర‌కు ముచ్చింతల్ లో ఏర్పాటు చేసిన స‌మతామూర్తి కేంద్రంలో కార్య‌క్ర‌మాలు ఉంటాయ‌ని వెల్ల‌డించారు. అస‌మాన‌త‌లు ఉండ కూడ‌ద‌ని, కుల మ‌తాల‌కు అతీతంగా బ‌తకాల‌ని బోధించార‌ని స్ప‌ష్టం చేశారు చినజీయ‌ర్ స్వామి(Chinna Jeeyar Swamy ).

అస్పృశ్య‌త‌ను రూపు మాపేందుకు స‌మాన‌త్వ‌మ‌నే వ్యాక్సిన్ ను రామానుజాచార్యులు ప్ర‌యోగించార‌ని తెలిపారు. ఇప్పుడు దానిని మ‌నంద‌రిలో పాదుకొల్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు.

ఆయ‌న ముచ్చింత‌ల్ లో మీడియాతో మాట్లాడారు. రూ. 1000 కోట్ల‌తో స‌మ‌తామూర్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశామ‌న్నారు. దాత‌ల స‌హ‌కారంతో దీనిని పూర్తి చేశామ‌న్నారు.

స‌ర్వ ప్రాణులంతా ఒక్క‌టేన‌ని ప‌రిత‌పించిన మ‌హానుభావుడు రామానుజ‌డ‌ని పేర్కొన్నారు. స్త్రీ, పురుష‌, వ‌ర్గ‌, కుల , మ‌త , ప్రాంత , రంగు భేదం లేని స‌మాజం కోసం స‌మ‌తామూర్తి ప‌రిత‌పించాడ‌ని కొనియాడారు.

త‌ర‌త‌రాలుగా ఆయ‌న‌ను త‌లుచుకునేలా, స్ఫూర్తి పొందేలా ఈ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశామ‌న్నారు. ఎన్నో ఏళ్ల కింద‌ట అంట‌రాని వారిని చేర‌దీసిన గొప్ప చ‌రిత్ర రామానుజుడికి ఉంద‌ని చెప్పారు త్రిదండి రామానుజ చిన‌జీయ‌ర్ స్వామి(Chinna Jeeyar Swamy ).

5 వేల మంది రుత్వికులు, 1035 హోమ‌కుండాల‌తో ల‌క్ష్మీ నారాయ‌ణ యాగాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ల‌క్ష‌న్న‌ర కిలోల దేశీవాళీ ఆవు పాల‌తో త‌యారు చేసిన నెయ్యిని వినియోగిస్తున్నామ‌ని చెప్పారు.

ఈనెల 5న దేశ ప్ర‌ధాని మోదీ 216 అడుగుల ఎత్తుతో ఉన్న రామానుజుల మ‌హా మూర్తిని ప్రారంభిస్తార‌ని తెలిపారు.

Also Read : తిరుమ‌ల భ‌క్తుల‌కు తీపి క‌బురు

Leave A Reply

Your Email Id will not be published!