Chinna Jeeyar Swamy : తిట్టుకోవడం పైనే పార్టీలు ఫోకస్
చిన్నజీయర్ స్వామి కీలక కామెంట్స్
Chinna Jeeyar Swamy : ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మొదటిసారి రాజకీయాలపై నోరు విప్పారు. తన స్వంత అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రస్తుతం స్వామీజీ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో మెరుగైన వాతావరణం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రాజకీయ పార్టీకి ఒక సిద్ధాంతం అన్నది ఉంటుందన్నారు. దానికి అనుగుణంగానే పాలన సాగుతుందని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు చిన్న జీయర్ స్వామీజీ(Chinna Jeeyar Swamy).
ఎన్నికల వరకే రాజకీయాలు అనేవి ఉండాలని, కానీ ఆ తర్వాత ప్రజల కోసం పని చేయాల్సిన బాధ్యత పార్టీలపై ఉంటుందన్నారు. ఒకవేళ ఎన్నికల్లో ఎవరు గెలిచినా ప్రజల రక్షణకోసమే పరిపాలన సాగిస్తారని చెప్పారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎన్నికలు అయ్యాక రాజకీయాలు చేయడం మానేయాలని సూచించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ స్వామీజీ. ప్రజా సంక్షేమమే పరమావధిగా పని చేయాలన్నారు.
ఇవాళ అలాంటి అనుకూలమైన వాతావరణం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా పార్టీలకు చెందిన నాయకులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కాకుండా ఒకరిపై మరొకరు పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ కాలం వెళ్ల దీస్తున్నారంటూ ఎద్దేవా చేశారు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామీ(Chinna Jeeyar Swamy).
ఇదిలా ఉండగా సమతా స్పూర్తి కేంద్రానికి ఏడాది పూర్తయిందన్నారు. ఈ సందర్భంగా సమతా కుంభ్ పేరుతో బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు చిన్నజీయర్ స్వామీజీ.
Also Read : శ్రీవారి భక్తులకు శుభవార్త
