Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి వారి పర్యవేక్షణలో కొనసాగుతున్న సహస్రాబ్ది మహోత్సవాలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎంకు సాదర స్వాగతం లభించింది. భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. జగన్ రెడ్డి(Jagan )పూర్తిగా సంప్రదాయ వస్తుల్లో ప్రవచన మండపానికి విచ్చేశారు.
ఇదిలా ఉండగా చిన్న జీయర్ సమక్షంలో చిన్నారులు విష్ణు సహస్ర అవధానం చేపట్టారు. వారిని జగన్ అభినందించారు. అంతకు ముందు సమతామూర్తి కేంద్రంలో 108 దివ్య దేశాల్లో 33 ఆలయాలకు రుత్వికులు ప్రాణ ప్రతిష్టాపన చేశారు.
యాగశాలలో సంస్కరించిన వాటితో శోభాయాత్ర చేపట్టారు. కాగా ఏపీ సీఎం మూడు గంటలకు పైగా శ్రీరామనగరం, సమతా కేంద్రంలో ఉంటారు. సీఎం జగన్ రెడ్డికి(Jagan )టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జూపల్లి రామేశ్వర్ రావు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
అక్కడి నుంచి నేరుగా సమతామూర్తి విగ్రహాన్ని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగన్ రెడ్డి. వెయ్యేళ్ల నాటి ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
సీఎం వెంట మంత్రులు ఉన్నారు. వేడుకల అనంతరం వెంటనే గన్నవరంకు తిరిగి వెళతారు. అంతకు ముందు చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు జగన్.
సమతామూర్తిని రూ. 1000 కోట్లతో ఏర్పాటు చేశారు. 216 అడుగులు ఉంది ఈ విగ్రహం.
Also Read : డేరా బాబాకు 21 రోజులు రిలీఫ్