Pawan Kalyan Chinnajeeyar : టాలీవుడ్ సూపర్ స్టార్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇవాళ రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని శ్రీరామానగరంను సందర్శించారు. ఇదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 216 అడుగుల భారీ విగ్రహం భగవద్ శ్రీ రామానుజాచార్యుల సమతామూర్తి సమతాకేంద్రాన్ని కలియ తిరిగారు.
ఈ సందర్భంగా జగత్ గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan Chinnajeeyar. ఆయనకు సాదర స్వాగతం పలికారు మై హోం చీఫ్ జూపల్లి రామేశ్వర్ రావు.
ఇదిలా ఉండగా రూ. 1000 కోట్ల తో ఈ అద్భుత రామానుజుడి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దేశంలోనే ఇది మొదటిది. ప్రపంచంలో రెండోదిగా వినుతికెక్కింది. మొదటి విగ్రహం బ్యాంకాక్ లోని బుద్దుడి విగ్రహం 316 అడుగులతో ఏర్పాటు చేశారు.
ఇప్పటికే వసంత పంచమిని పురస్కరించుకుని దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈనెల 2న రామనుజ సహస్రాబ్ది మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఈ ఉత్సవాలు 14 వరకు కొనసాగుతాయి. ఈ ప్రాంగణమంతా దేదీప్యమానంగా వెలుగుతోంది. భక్తి ప్రపత్తులతో అలరారుతోంది. ఆధ్యాత్మికత ఉట్టి పడేలా సమతా కేంద్రాన్ని తీర్చిదిద్దారు.
ఈ విగ్రహాన్ని చైనాలో తయారు చేశారు. ఇందులో 60 మంది నిపుణులు పాల్గొన్నారు. ఇక చిన్న జీయర్ స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు.
సమతామూర్తి స్పూర్తి దేశానికి ఆదర్శ ప్రాయమన్నారు. వెయ్యేళ్ల కిందట చూపిన మార్గం స్పూర్తి దాయకమన్నారు.
Also Read : విశిష్టాద్వైతం మానవాళికి మార్గం