Chirag Paswan : తండ్రిని త‌ల్చుకుని చిరాగ్ పాశ్వాన్ కంట‌త‌డి

హాజిపూర్ లో రాం విలాస్ పాశ్వాన్ విగ్ర‌హావిష్క‌ర‌ణ

Chirag Paswan : మాజీ ఎంపీ చిరాగ్ పాశ్వాన్ భావోద్వేగానికి లోన‌య్యారు. త‌ల్లితో క‌లిసి క‌న్నీరు మున్నీరుగా విల‌పించారు. బీహార్ లోని హాజీపూర్ లో త‌న తండ్రి రాం విలాస్ పాశ్వాన్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు.

సోద‌రితో క‌లిసి కంట త‌డి పెట్టారు. ఈ దృశ్యం ప్ర‌తి ఒక్క‌రిని క‌దిలించింది. లోక్ జ‌న్ శ‌క్తి పార్టీ (ఎల్జేపీ ) వ్య‌వ‌స్థాప‌కుడు, కేంద్ర మంత్రి దివంగ‌త రామ్ విలాస్ పాశ్వాన్ భారీ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సంద‌ర్భంగా కుమారుడు చిరాగ్ పాశ్వాన్ త‌న త‌ల్లి, సోద‌రి, కుటుంబీకుల‌తో క‌లిసి భారీ జ‌నం మ‌ధ్య త‌న తండ్రికి నివాళిగా విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు.

దేశ రాజ‌కీయాల‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను క‌లిగి ఉన్నారు రాం విలాస్ పాశ్వాన్. బ‌హుజ‌నుల గొంతుక‌గా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నారు. త‌ల్లి రీనా పాశ్వాన్ కూడా కంట త‌డి పెట్టారు త‌న భ‌ర్త‌ను త‌ల్చుకుని.

జూలై 5న దివంగ‌త నాయ‌కుడు రామ్ విలాస్ పాశ్వాన్ జ‌యంతి. ఈ సంద‌ర్భంగా క‌ర్మ‌భూమి హాజీపూర్ లో విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌డం త‌న‌కు గ‌ర్వంగా ఉంద‌న్నారు చిరాగ్ పాశ్వాన్(Chirag Paswan).

ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు. తన తండ్రి అజాత శ‌త్రువ‌ని, రాజ‌కీయాల్లో మేరున‌గ ధీరుడని కొనియాడారు. ఆయ‌న ఉన్నంత వ‌ర‌కు ఏ ఒక్క‌రూ ఎదురు చెప్పిన దాఖ‌లాలు లేవ‌న్నారు.

త‌న తండ్రి సింహం అని ఆయ‌న కొడుకును తాను అని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో హాజిపూర్ ఎమ్మెల్యే అవ‌ధేష్ సింగ్ , లాల్ గంజ్ ఎమ్మెల్యే సంజ‌య్ సిఒంగ్ , ముఖేష్ సాహ్ని , ఎల్జేపీకి చెందిన ప‌లువురు ప్రజాప్ర‌తినిధులు, అభిమానులు, కార్య‌క‌ర్త‌లు భారీ సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు.

రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ మ‌ద‌న్ మోహ‌న్ ఝా, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.

Also Read : ఉద్ద‌వ్ ఠాక్రేకు చెప్పినా ప‌ట్టించు కోలేదు – షిండే

Leave A Reply

Your Email Id will not be published!