Chirag Paswan : చిరాగ్ పాశ్వాన్ మోదీ సర్కార్ పై మండిపడ్డారు. తనను దారుణంగా మోసం చేశారంటూ ఆరోపించారు. ఢిల్లీ బంగ్లా నుండి బహిష్కరించడాన్ని తప్పు పట్టారు.
తాము ప్రాణపదంగా దాచుకున్న వస్తువులను, ఫోటోలను బయటకు విసిరి వేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు చిరాగ్ పాశ్వాన్(Chirag Paswan). తన తండ్రి, దివంగత కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కు కేటాయించిన ప్రభుత్వ బంగ్లా నుంచి గత వారం ఖాళీ చేయించారు.
ఈ సందర్భంగా తన కుటుంబాన్ని బయటకు విసిరి వేసిన విధానం, అవమానించిన తీరు దారుణమని వాపోయాడు. దోఖా హూ హై అంటూ మండిపడ్డారు.
తన తండ్రికి ఆనాడు జన్ పథ్ 12లో గది కేటాయించారని , దానిలో ఉండేందుకు తమకు హక్కు లేదని దీంతో తాము ఖాళీ చేసేందుకు సిద్దమయ్యామని తెలిపారు.
ప్రభుత్వానికి చెందింది శాశ్వతం కాదు. దానిని క్లెయిమ్ చేయాలని తాము ఎప్పటికీ ఆలోచించమన్నారు. ఇన్ని ఏళ్లపాటు ఉండటం తాము అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు చిరాగ్ పాశ్వాన్(Chirag Paswan).
మా తండ్రి ఎన్నో ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉన్నారు. ఈ ఇల్లు ఆచరణాత్మకంగా సామాజిక న్యాయానికి పుట్టినల్లు , ఉద్యమానికి కేరాఫ్ గా ఉందన్నారు చిరాగ్ పాశ్వాన్. లాక్ డౌన్ సమయంలో తమ తండ్రి వలస వచ్చిన వారిని చూసి ఆందోళన చెందుతుండే వారన్నారు.
ఇల్లు పోగొట్టుకున్నందుకు తాను బాధ పడటం లేదని, అది ఎప్పుడో పోయిందన్నారు. అది జరిగిన విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
Also Read : భారత్ కు రానున్న బోరిస్ జాన్సన్