DK Shivakumar Chopper : డికే ఛాప‌ర్ అత్య‌వ‌స‌ర ల్యాండింగ్

సిబ్బంది, ఛానెల్ రిపోర్ట‌ర్ క్షేమం

DK Shivakumar Chopper : క‌ర్ణాట‌క ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ చీఫ్ డీకే శివ‌కుమార్ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట ప‌డ్డారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న స్వంతంగా ఛాప‌ర్ ను వాడుతున్నారు. మంగ‌ళ‌వారం డీకే శివ‌కుమార్ ప్ర‌యాణిస్తున్న ఛాప‌ర్ విమానం అత్య‌వ‌స‌రంగా ల్యాండింగ్ అయ్యింది. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికీ ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదని స‌మాచారం.

డీకే శివ‌కుమార్ , పైల‌ట్ తో పాటు ఆయ‌న‌ను ఇంట‌ర్వ్యూ చేస్తున్న ఓ క‌న్న‌డ న్యూస్ ఛానెల్ కు చెందిన జ‌ర్న‌లిస్టు హెలికాప్ట‌ర్ లో ఉన్నారు. ఇవాళ మ‌ధ్యాహ్నం కాక్ పిట్ గ్లాస్ కు గాలి ప‌టం ఢీకొట్టింది. దీంతో క‌ర్ణాట‌క కాంగ్రెస్ చీఫ్ డీకే శివ‌కుమార్ హెలికాప్ట‌ర్(DK Shivakumar Chopper) హెచ్ఏఎల్ విమాన‌శ్ర‌యంలో అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ అయ్యింది. కోలార్ జిల్లా ముల్బాగ‌ల్ లో జ‌రిగే బ‌హిరంగ స‌భ‌కు హాజ‌ర‌య్యేందుకు కేపీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్ వెళుతున్నారు.

ఇందు కోసం ఆయ‌న ప్ర‌త్యేక ఛాప‌ర్ లో ప్ర‌యాణం చేస్తున్నారు. బెంగ‌ళూరులోని జ‌క్కూర్ విమానాశ్ర‌యం నుండి హెలికాప్ట‌ర్ ఎగిరింది. కానీ గాలిప‌టం ఢీకొట్టింద‌ని శివ‌కుమార్(DK Shivakumar) స‌న్నిహితులు వెల్ల‌డించారు. ఈ ప్ర‌మాదంలో ఛాప‌ర్ అద్దం ముక్క‌లు ముక్క‌లైంది. దానిని ఎయిర్ పోర్ట్ లోనే ఉంచారు. ఇందుకు సంబంధించి ఇంకా స‌మాచారం తెలియాల్సి ఉంది.

Also Read : లిక్క‌ర్ స్కాంలో ఎంపీలు సంజ‌య్..చ‌ద్దా

Leave A Reply

Your Email Id will not be published!