Elon Musk : క్రిస్ రాక్ ఆహ్వానం ఎలోన్ మ‌స్క్ ఆనందం

పంచుకున్న టెస్లా సిఇఓ..చైర్మ‌న్

Elon Musk :  మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు టెస్లా సిఇఓ, చైర్మ‌న్ ఎలోన్ మ‌స్క్. క్రిస్ రాక్ తాను నిర్వ‌హిస్తున్న షోలో పాల్గొనాల‌ని ఆహ్వానించాడ‌ని తెలిపారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదికా పంచుకున్నారు.

కాగా క్రిస్ రాక్ కు ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి హాస్య నటుడిగా పేరొందారు. సాట‌ర్డే నైట్ లైవ్ మోనో లాగ్ నుండి పాత క్లిప్ ను పోస్ట్ చేశారు. స్టాండ్ అప్ ఈజ్ మై సైడ్ హస్టిల్ కోట్ ను కూడా ఎంచుకున్నారు నెటిజ‌న్లు.

ఈ క్లిప్ లో బిలియ‌నీర్ అయిన ఎలోన్ మ‌స్క్(Elon Musk) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు ఇందులో ఉన్నాయి. ఎల‌క్ట్రిక్ కార్ల‌ను తిరిగి క‌నిపెట్టా. ప్ర‌జ‌ల‌ను రాకెట్ షిప్ లో అంగార‌క గ్ర‌హానికి పంపుతున్నా.

ఈ స‌మ‌యంలో నేను సాధార‌ణ వ్య‌క్తిగా ఉంటాన‌ని మీరు ఎలా అనుకుంటున్నారు అంటూ ప్ర‌శ్నించారు. న‌న్ను ఆహ్వానించినందుకు ధ‌న్య‌వాదాలు క్రిస్ రాక్. నేను నీతో పాల్గొనేందుకు ఎల్ల‌ప్ప‌టికీ సిద్దంగా ఉంటాన‌ని ఎలోన్ మ‌స్క్(Elon Musk) వెల్ల‌డించాడు.

తాజాగా టెస్లా సిఇఓ, చైర్మ‌న్ చేసిన ట్వీట్ పై పెద్ద ఎత్తున స్పంద‌న ల‌భించింది. ఆపై లైక్ లు, కామెంట్ల‌తో హోరెత్తింది. ఈ సంవ‌త్స‌రం ఆస్కార్ వేడుక‌లో న‌టుడు విల్ స్మిత్ నుండి క్రిస్ రాక్ అందుకున్న అప‌ఖ్యాతి పాల‌య్యారు.

ఆయ‌న విల్ స్మిత్ చేతిలో చెంప దెబ్బ తిన్నారు. ఈ స‌మ‌యంలో మీరు క్రిస్ రాక్ నుంచి ఇన్విటేష‌న్ అందుకోవ‌డం విస్తు పోయేలా చేసింది అంద‌రినీ. ప్ర‌స్తుతం మ‌స్క్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : మిస్త్రీ మ‌ర‌ణంపై మ‌హీంద్రా కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!