Christopher Lu : 26/11 దాడులపై విచారణకు యుఎస్ సిద్దం
అమెరికా రాయబారి క్రిస్టోఫర్ లూ ప్రకటన
Christopher Lu : భారత దేశంలో 26/11 దాడులకు కుట్రలు పాల్పడిన వారు ఎవరో బట్ట బయలు చేసేందుకు తాము సంసిద్దులమై ఉన్నామని స్పష్టం చేసింది అమెరికా. ఇదే సమయంలో విచారణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు ఆ దేశ దౌత్యవేత్త క్రిస్టోఫర్ లూ(Christopher Lu).
భారత దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో జరిగిన ఆనాటి మారణ హోమంలో మరణ హోమంలో ఆరుగురు అమెరికన్లు ఉన్నారని స్పష్టం చేశారు. సోమవారం క్రిస్టోఫర్ లూ మాట్లాడారు. గత వారం భారత దేశం నిర్వహించిన యుఎన్ భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీ (సీటీసీ) ప్రత్యేక సమావేశంలో యుఎస్ ప్రతినిధి బృందానికి క్రిస్టోఫర్ లూ నాయకత్వం వహించారు.
ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒక చోటు చేసుకుంటున్నాయని వాటిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రతి దేశంపై ఉందన్నారు లూ. ఉగ్రవాదులు సరికొత్త టెక్నాలజీని వాడుకుంటున్నారని దీనిపై కూడా ఫోకస్ పెట్టాల్సి వస్తుందన్న విషయం తమకు తెలుసన్నారు.
ఈ ముఖ్యమైన కార్యక్రమంలో ఇండియాకు రావడం ఆనందంగా ఉందన్నారు. అమెరికా, భారత దేశం బలమైన సంబంధాలు కలిగి ఉన్నాయని చెప్పారు అమెరికా దౌత్యవేత్త. అసాంఘిక శక్తులను ఆటకట్టించేందుకు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఉచిత, బహిరంగ ఇంటర్నెట్ అనేది ముఖ్యమైన భావనగా ఆయన పేర్కొన్నారు.
డిజిటల్ కరెన్సీ కి సంబంధించి సానుకూల అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నామని చెప్పారు.
Also Read : ఇరాన్ సెలబ్రిటీ చెఫ్ మృతిపై ఆందోళన