Dmitry Medvedev : అమెరికాలో అంతర్యుద్దం తప్పదు
రష్యా ఉన్నత అధికారి డిమిత్రి మెద్వెదేవ్
Dmitry Medvedev : రష్యన్ ఫెడరేషన్ భద్రతా మండలి డిప్యూటీ చైర్ డిమిత్రి మెద్వెదేవ్(Dmitry Medvedev) షాకింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే ఏడాది 2023లో అమెరికాలో అంత్యరుద్దం రానుందని అంచనా వేశారు. కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఆ తర్వాత యుకెకు కూడా చేరుతుందని, అది కూడా పతనం అవుతుందని పేర్కొన్నారు మెద్వెదేవ్.
బ్రిటన్ తిరిగి యూరోపియన్ యూనియన్ లో చేరుతుందని పేర్కొన్నారు. ఆయన ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విస్తు పోయేలా చేసింది. పోలాండ్ , హంగేరీలు ఉక్రెయిన్ కు చెందిన పశ్చిమ భాగాలను , జర్మనీకి చెందిన కొంత ప్రాంతాన్ని ఆక్రమించు కుంటాయని జోష్యం చెప్పారు డిమిత్రి మెద్వెదేవ్. పోలాండ్ , బాల్టిక్ రాష్ట్రాలు, చెచియా, స్లోవేకియా, కైవ్ రిపబ్లిక్ , ఇతర బహిష్కృత దేశాలతో సహా దాని ఉపగ్రహాలు ఫోర్త్ రీచ్ లో విలీనం చేయబడతాయని తెలిపారు.
చాలా మంది ఫ్యూచరిస్టిక్ పరికల్పనలతో ముందుకు వచ్చారు. క్రూరమైన వాటిని, చాలా అసంబద్దమైన వాటిని కూడా వేరు చేసేందుకు పోటీ పడుతున్నారంటూ డిమిత్రి మెద్వెదేవ్(Dmitry Medvedev) వెల్లడించారు. ఫ్రాన్స్ , ఫోర్త్ రీచ్ గా ఏర్పడిన దేశాలతో యుద్దం జరిగే అవకాశం లేక పోలేదని అంచనా వేశారు. ఉత్తర ఐర్లాండ్ యుకె నుండి విడి పోయి రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ లో చేరుతుందని పేర్కొన్నారు.
యుఎస్ లో అంతర్యుద్దం ముగిసిన తర్వాత ప్రపంచం లోని అత్యంత ధనవంతుడైన ఎలోన్ మస్క్ అనేక రాష్ట్రాలలో అధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తారని కూడా అంచనా వేశారు.
Also Read : మంచు తుఫాను దెబ్బకు అమెరికా విలవిల