NV Ramana : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా ఏకపక్ష దాడులతో ఉక్రెయిన్ నామ రూపాలు లేకుండా పోయే ప్రమాదం పొంచి ఉంది.
ఇప్పటికే బాంబుల దాడులతో, మిస్సైళ్ల ప్రయోగంతో రష్యా విరుచుకు పడుతోంది. ఇక భారత దేశానికి చెందిన చాలా మంది భారతీయులతో పాటు విద్యార్థులు అత్యధిక సంఖ్యలో అక్కడ కొలువుతీరారు.
వారిని స్వదేశానికి తీసుకు వచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అత్యున్నత సమావేశం ఏర్పాటు చేసింది. ప్రస్తుత పరిస్థితిపై అంచనా వేస్తోంది. అక్కడి ఎంబసీతో సంప్రదింపులు జరుపుతోంది.
ఉక్రెయిన్, రష్యా యుద్దానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు జస్టిస్ రమణ. ఉక్రెయిన్ పై యుద్దాన్ని ఆపాలంటూ ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ను ఆదేశించ గలనా అని నిర్వేదం వ్యక్తం చేశారు.
ఓ కేసు విచారణ సమయంలో ఇవాళ సుప్రీంకోర్టులో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ లో చిక్కుకు పోయిన విద్యార్థుల తరలింపు విషయంలో ఓ న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసును సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. యుద్ద సమయంలో చిక్కుకు పోయిన భారతీయుల్ని తరలించేందుకు కేంద్ర సర్కార్ వీలైనంత కృషి చేస్తోందంటూ స్పష్టం చేసింది.
భారతీయ విద్యార్థుల పట్ల సానుభూతి ప్రకటిస్తున్నట్లు చెప్పారు రమణ. సోషల్ మీడియాలో ఓ వీడియో చూశానని, సీజేఐ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారని తెలిపారు.
ప్రస్తుతం సీజేఐ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.