CJI Chandrachud : మణిపూర్ హింసపై కేసులు ఎన్ని – సీజేఐ
కేంద్రాన్ని నిలదీసిన సుప్రీం ధర్మాసనం
CJI Chandrachud : మణిపూర్ లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు, అల్లర్లతో పాటు మహిళలను ఊరేగించిన ఘటన దేశాన్ని కుదిపి వేసింది. దీనికి సంబంధించి భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టులో విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్ కేసుతో పాటు పశ్చిమ బెంగాలలో మహిళలపై జరుగుతున్న నేరాలను పరిగణలోకి తీసుకోవాలని చేసిన సూచనను పరిగణలోకి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
CJI Chandrachud Said
తీసుకోక పోవడానికి ఎలాంటి కారణాలు లేవు. ఎందుకంటే నిస్సందేహంగా దేశ వ్యాప్తంగా మహిళలపై నేరాలు జరుగుతున్నాయి. అది మన సామాజిక వాస్తవం. కానీ ఇక్కడ మత పరమైన , మతతత్వ పరిస్థితులలో మహిళలపై నేరాలు, హింసకు పాల్పడడం వంటి ఘటనలు చోటు చేసుకుండడం బాధాకరం. అన్ని ప్రాంతాల్లోనూ మహిళలపై నేరాలు జరుగుతున్నాయనే వాస్తవాన్ని కొట్టి పారేసేందుకు వీలు లేదన్నారు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్(CJI Chandrachud).
మణిపూర్ ఒక్కటే కాదు దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొందని మీరు భావిస్తున్నట్లు అనిపిస్తోంది. ఇది వాస్తవమే అయినప్పటికీ దీనికి ఎవరు బాధ్యత వహించాలన్నది తేల్చుకోవాల్సింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేనని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆదుకోవాల్సిన బాధ్యతే కాదు కాపాడు కోవాల్సింది కూడా మనమేనని కుండ బద్దలు కొట్టారు.
Also Read : Former MLA Join BJP : బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే