CJI Chandrachud : కేంద్రం అఫిడ‌విట్ ను ప‌రిగ‌ణించం

సీజేఐ జ‌స్టిస్ ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్

CJI Chandrachud : కేంద్రంలో కొలువు తీరిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వానికి దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం నుంచి అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి. ప్ర‌ధానంగా కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ విష‌యంలో , తాజాగా కేంద్ర అత్యున్న‌త ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ చీఫ్ మిశ్రా ప‌ద‌వీ కాలాన్ని మూడోసారి పొడిగించ‌డంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. తాము ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేద‌ని, వెంట‌నే ఈడీ చీఫ్ ను మార్చాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది ధ‌ర్మాసనం.

ఇదిలా ఉండ‌గానే మ‌రో షాకింగ్ త‌గిలింది కేంద్రానికి. భార‌త దేశ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దును స‌మ‌ర్థిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం అఫిడ‌విట్ ను దాఖ‌లు చేసింది. కాగా విచార‌ణ స‌మ‌యంలో సుప్రీంకోర్టు దానిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోదని సీజేఐ జ‌స్టిస్ ధ‌నంజ‌య(CJI Chandrachud) వై చంద్ర‌చూడ్ స్ప‌ష్టం చేశారు.

కేంద్రం ఇచ్చిన తాజా అఫిడ‌విట్ లో కోర్టులో ఉన్న రాజ్యాంగ ప‌ర‌మైన ప్ర‌శ్న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని సీజేఐ వ్యాఖ్యానించ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. కాగా సీజేఐ చేసిన వ్యాఖ్య‌లపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇప్ప‌టికే కేంద్రం ఆయ‌న ప‌ట్ల గుర్రుగా ఉంది. ఇదే స‌మ‌యంలో పెద్ద ఎత్తున చంద్ర‌చూడ్ కు మ‌ద్ద‌తు ల‌భిస్తుండ‌డం విశేషం.

Also Read : MLA Seethakka : ఉచిత విద్యుత్ బ‌క్వాస్ – సీత‌క్క‌

Leave A Reply

Your Email Id will not be published!