CJI Chandrachud : ఇంకెంత కాలం భ‌య‌ప‌డుతూ బ‌త‌కడం

సీజేఐ చంద్ర‌చూడ్ షాకింగ్ కామెంట్స్

CJI Chandrachud : న్యూఢిల్లీ – భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న సీజేఐగా కొలువు తీరిన త‌ర్వాత ప‌లు అంశాల‌పై తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేస్తూ వ‌స్తున్నారు. అంతే కాకుండా పాల‌కులు బాధ్య‌తా రాహిత్యంతో వ్య‌వ‌హ‌రిస్తే దేశం ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టేన‌ని హెచ్చ‌రించారు.

CJI Chandrachud Comment Viral

ప్ర‌ధానంగా కేంద్రంలో కొలువు తీరిన న‌రేంద్ర మోదీ, భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ అనుస‌రిస్తున్న విధానాల‌ను, నిర్ణ‌యాల‌ను, చ‌ర్య‌లను తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ ఎంపిక‌ను త‌ప్పు ప‌ట్టారు.

అంతే కాకుండా మ‌ణిపూర్ లో చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఆపై మోదీ ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోందంటూ మండిప‌డ్డారు. మీకు చేత కాక పోతే సుప్రీంకోర్టు రంగంలోకి దిగుతుంద‌ని హెచ్చ‌రించారు.

తాజాగా మ‌రో కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఎంత కాలం ఇలా భ‌య‌ప‌డుతూ బ‌తుకుతార‌ని ప్ర‌శ్నించారు సీజేఐ(CJI Chandrachud). ఇప్పుడు గ‌ళం ఎత్త‌క పోతే ఇంకెప్పుడూ ప్ర‌శ్నించ లేమ‌న్నారు. పిరికి పంద‌ల్లా కూర్చుంటే మ‌న పిల్ల‌లు, దేశానికి చెందిన వారు కూడా పిరికి వాళ్లుగా మారి పోతార‌ని ఆవేద‌న చెందారు. హ‌క్కుల కోసం ఉద్య‌మించ‌క పోతే నియంతృత్వం రాజ్యం ఏలుతుంద‌న్నారు.

Also Read : Manavatha Roy : కాంగ్రెస్ మోసం రాయ్ ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!