CJI Chandrachud : టెక్నాల‌జీ కీల‌కం న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు అవ‌స‌రం

డేటా భ‌ద్ర‌త‌పై జాతీయ మోడ‌ల్

CJI Chandrachud : ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో టెక్నాల‌జీ వినియోగం అత్య‌త ముఖ్యంగా మారిందని అన్నారు భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్(CJI Chandrachud) . ప్ర‌ధానంగా న్యాయ వ్య‌వ‌స్థలో కీల‌క మార్పులు చోటు చేసుకున్నాయ‌ని తెలిపారు. సాంకేతిక‌త అన్న‌ది అనుసంధానం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి డేటా అన్న‌ది ముఖ్య‌మ‌న్నారు సీజేఐ.

సైబ‌ర్ సెక్యూరిటీలో భాగంగా డేటాను ర‌క్షించ‌డం లేదా భ‌ద్ర‌ప‌ర్చ‌డం అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు. కొత్త టెక్నాల‌జీలో చోట చేసుకున్న మార్పుల‌ను గుర్తించాల‌ని, వాటి సాయంతో కేసుల‌ను త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించేందుకు మార్గం ఏర్ప‌డుతుంద‌న్నారు ధ‌నంజ‌య చంద్ర‌చూడ్.

ఇందుకు హైకోర్టులు సిద్దంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు సీజేఐ. ఇందులో ఇ – ఫైలింగ్ కీల‌క‌మ‌న్నారు. ఒక్క‌సారి డేటాను నిక్షిప్తం చేస్తే ఇక ప్ర‌త్య‌క్షంగా కేసుల‌కు సంబంధించి విచార‌ణ జ‌ర‌పాల్సిన ప‌ని లేద‌న్నారు ధ‌నంజ‌య చంద్ర‌చూడ్(CJI Chandrachud).

ఇప్ప‌టికే న్యాయ వ్య‌వ‌స్థ‌లో ప‌ని చేస్తున్నా వారు, న్యాయ‌వాదులు డేటా వినియోగంలో ట్రైనింగ్ పొందాల‌ని సూచించారు. సైబ‌ర్ సెక్యూరిటీ అంశంలో డేటా ర‌క్ష‌ణ‌, గోప్య‌త ముఖ్య‌మ‌న్నారు. వీటిని అధ్య‌య‌నం చేసేందుకు ఓ క‌మిటీని కూడా ఏర్పాటు చేశామ‌ని చెప్పారు జ‌స్టిస్ ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్.

Also Read : కంపెనీలు వ‌స్తేనే కొలువులు – కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!