CJI Same Sex : సీజేఐ సంచలన తీర్పు
శాసన వ్యవస్థలో జోక్యం చేసుకోలేం
CJI Same Sex : న్యూఢిల్లీ – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వలింగ సంపర్కుల పెళ్లిపై నమోదైన కేసుకు సంబంధించి సుదీర్ఘ విచారణలు కొనసాగాయి. దీనిపై గత కొంత కాలంగా పెద్ద ఎత్తున ఉత్కంఠతో ఎదురు చూశారు. వాదోప వాదనలు విన్న అనంతరం సీజేఐ సంచలన తీర్పు వెలువరించారు.
CJI Same Sex Comment
ఈ అంశం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. తీవ్ర చర్చోప చర్చలకు దారి తీసింది. స్వలింగ సంపర్కుల పెళ్లికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీజేఐ(CJI). శాసన వ్యవస్థలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు.
ఇందుకు సంబంధించి కేంద్రంలో కొలువు తీరిన మోదీ , భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వమే కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు ధనంజయ వై చంద్రచూడ్. ప్రత్యేక వివాహ చట్టాన్ని రద్దు చేయలేమంటూ కుండ బద్దలు కొట్టారు. వివాహ చట్టంలో మార్పులు చేయాలా వద్దా అనేది పార్లమెంట్ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు సీజేఐ.
ఇదిలా ఉండగా స్వలింగ వివాహాలకు చట్ట బద్దత కల్పించాలని కోరుతూ పెద్ద ఎత్తున సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. యావత్ దేశం సుప్రీం ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపై ఎదురు చూసింది.
Also Read : Nara Bhuvaneshwari : ఏపీ సర్కార్ పై భువనేశ్వరి ఫైర్