CJI Vikas Singh : వికాస్ సింగ్ పై సీజేఐ సీరియ‌స్

నిశ్శ‌బ్దంగా ఉండండి లేదంటే వెళ్లండి

CJI Vikas Singh : సాధ్య‌మైనంత వ‌ర‌కు శాంతంగా ఉండే భార‌త దేశ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్ కు ఉన్న‌ట్టుండి కోపం వ‌చ్చింది. ఈ మేర‌కు విచార‌ణ‌లో భాగంగా సీనియ‌ర్ న్యాయ‌వాది వికాస్ సింగ్ పై(CJI Vikas Singh) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ద‌య‌చేసి నిశ్శ‌బ్దంగా ఉండండి లేదంటే కోర్టును వ‌దిలి వెళ్లండి అని ఆదేశించారు. ప్ర‌తి దానికి ఒక ప‌ద్ద‌తి, హ‌ద్దు అనేది ఉంటుంద‌ని పేర్కొన్నారు.

ఇది కోర్టు..ప‌ది మందికి ఆద‌ర్శంగా ఉండాల్సిన ప్ర‌దేశం. ఎలా ప‌డితే అలా మాట్లాడ‌టం కుద‌ర‌దు. ఏదైనా చెప్పాల‌ని అనుకుంటే ముందుగా ప్రిపేర్ అయి రావాలి. కానీ ఇష్టానుసారంగా మాట్లాడ‌తానంటే కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పారు సీజేఐ. ఈ సంద‌ర్భంగా సీనియ‌ర్ న్యాయ‌వాదులు క‌పిల్ సిబ‌ల్ , ఎన్ కే కౌల్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా త‌ర‌పున దేశ ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి(CJI) క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. దీంతో సీజేఐ చంద్ర‌చూడ్ కొంచెం శాంతించారు.

ఒక ర‌కంగా నిగ్ర‌హాన్ని కోల్పోయారు. పిటిష‌న్ ను జాబితా చేయ‌డంపై వాడి వేడి మాట‌లు కొన‌సాగాయి. ఈ సంద‌ర్భంగా సీజేఐకి న్యాయ‌వాది వికాస్ సింగ్ కు మ‌ధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు న్యాయ‌వాదుల కోసం భూమికి సంబంధించిన కేసును ముందుకు తీసుకు రావాల‌ని కోరారు వికాస్ సింగ్ . నిశ్శ‌బ్దంగా ఉండండి..లేదా కోర్టును వ‌దిలి వేయండి..మీరు మ‌మ్మ‌ల్ని భ‌య పెట్ట లేరంటూ స్ప‌ష్టం చేశారు సీజేఐ జ‌స్టిస్ చంద్ర‌చూడ్.

సుప్రీంకోర్టుకు కేటాయించిన భూమిని న్యాయ‌వాదుల కోసం ఛాంబ‌ర్ బ్లాక్ కోసం ఉప‌యోగించాల‌ని కోరుతూ న్యాయ‌వాదుల సంఘం త‌ర‌పున దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై విచార‌ణ కు బార్ అసోసియేష‌న్ చీఫ్ వికాస్ సింగ్ ఒత్తిడి తెచ్చారు.

Also Read : జేఎన్యూలో రూల్స్ క‌ఠినం

Leave A Reply

Your Email Id will not be published!