Sameer Wankhede : సమీర్ వాంఖడే కులంపై క్లీన్ చిట్
ఆరోపణలన్నీ అబద్దాలేనని స్పష్టం
Sameer Wankhede : మరాఠాలో సమీర్ వాంఖడే పేరు తెలియని వారంటూ ఉండరు. ఎవరైనా సరే మరాఠా వాసులంతా అతడిని పోలీసుల్లో డాన్ గా చూస్తారు. అలాగే పరిగణిస్తారు.
నిజాయతీ కలిగిన ఆఫీసర్ గా పేరొందారు. నార్కో డ్రగ్స్ విభాగంలో పని చేస్తున్న సమయంలో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడిని అరెస్ట్ చేశాడు.
ఇక అప్పటి నుంచి ప్రభుత్వం వర్సెస్ సమీర్ వాంఖడే(Sameer Wankhede) గా మారి పోయింది. మంత్రిగా ఉన్న నవాబ్ మాలిక్ టార్గెట్ చేశాడు సమీర్ ను. అతడి కులంపై సంచలన ఆరోపణలు చేశాడు.
తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగం పొందాడంటూ విమర్శించాడు. దీనిపై పెద్ద ఎత్తున రాద్ధాంతం చోటు చేసుకుంది.
ఎన్సీబీ మాజీ ముంబై డరెక్టర్ గా పని చేసిన సమీర వాంఖడే పుట్టుకతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహర్ కులస్తుడు. ఈ మేరకు అతడిపై విచారణకు ఆదేశించింది కేంద్రం.
దీంతో తన కుల ధ్రువీకరణకు సంబంధించి పూర్తి ఆధారాలను సమర్పించారు. ఈ మేరకు పూర్తిగా విచారణ జరిపింది మహారాష్ట్ర సామాజిక న్యాయ విభాగం స్పష్టం చేసింది.
ఆయన కులం అనుమానంపై ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది మహారాష్ట్ర సర్కార్. కుల ధ్రువీకరణ పరిశీలన కమిటీ పూర్తిగా విచారణ జరిపింది.
సమీర్ వాంఖడే, తండ్రి ధ్యాన్ దేవ్ వాంఖడే హిందూ మతాన్ని వీడినట్లు కానీ ఇస్లాం మతాన్ని స్వీకరించినట్లు కానీ ఎక్కడా ఆధారాలు లభించ లేదంటూ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఎలాంటి ఆధారాలు లభించ లేదని తెలిపింది కమిటీ.
Also Read : ప్రజా చైతన్యం ప్రభుత్వంపై యుద్ధం